Silk Smitha :
సిల్క్ స్మిత అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. పట్టుచీర విజయలక్ష్మి వడ్లపట్ల అనబడే ఈమె తొలిసారిగా 1981లో తమిళ్ చిత్రం వండిక్కక్కరంలో సిల్క్ పాత్రతో మొదటిసారి వెండితెర మీద మెరిసింది.. ఈ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది.. ఈ సినిమాలో ఆమె సిల్క్ అనే అమ్మాయిగా నటించింది.. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దీంతో అప్పటి నుండి ఈమె సిల్క్ స్మితగా ఫేమస్ అయ్యింది.. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారిపోయి మరిన్ని అవకాశాలు అందుకుంది.. చెన్నై లోని ఏవిఎం స్టూడియో దగ్గర డైరెక్టర్ విను చక్రవర్తి ఈమె డ్యాన్స్ ను చూసి ఆమెను డ్యాన్స్, నటనలో మరింత శిక్షణ ఇచ్చి ఆర్టిస్ట్ గా తీర్చిదిద్దాడు.
ఇక ఈమె సిల్క్ స్మిత అస్లీల సన్నివేశాలు, హాట్ హాట్ ఫోజులిచ్చే పాత్రల్లో సిల్క్ స్మిత నటించి ఫేమస్ అయ్యింది.. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలో రజినీకాంత్ మూడుముగమ్ సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది.. అప్పటి నుండి ప్రతీ హీరో కూడా తమ సినిమాల్లో సిల్క్ స్మిత ఉండాలని ఆమెతో ఒక పాటకు డ్యాన్స్ చేయించాలని అనుకునే వారు..
ఈ అమ్మడికి అంతటి క్రేజ్ దక్కింది.. 1980-90 మధ్యలో ఈమె కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకు పోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈమె దాదాపు 450 సినిమాల్లో నటించింది. ఈమెకు ఎంతటి క్రేజ్ ఉంది అంటే ఆమె ఎంగిలి కోసం డబ్బులు ఖర్చు చేసుకునేందుకు పోటీ పడేవారట..
అలా ఈమె ఎంగిలి చేసిన యాపిల్ ను వేలం వేస్తె భారీ ధరకు అమ్ముడు పోయినట్టు టాక్ వినిపిస్తుంది.. ఈమె ఒకసారి షూటింగ్ సమయమ్లో యాపిల్ తింటుంటే ఒకరు రెండు వందల రూపాయలు చెల్లించి తీసుకున్నారట. ఇప్పటి అలాంటి భామలు చాలా మంది ఉన్నారు. కానీ అప్పట్లో ఈమె మాత్రమే ఉండడంతో అంత డిమాండ్ ఈ భామకు.. అయితే ఈమె అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని 1996లో మరణించింది. చిన్న వయసులో మరణించడం ఆమె అభిమానులకు దుఃఖాన్ని మిగిల్చింది.