
Medicines for Diabetics : డయాబెటిస్ ప్రాణాంతకమైన వ్యాధి షుగర్ ఒకసారి వచ్చిందంటే ఇక అంతే సంగతి. జీవితాంతం మందులు వాడాల్సిందే. మన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటున్నా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలితో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. చెడు అలవాట్ల కారణంగా షుగర్ వ్యాధి పలువురిని కబళిస్తోంది.
షుగర్ వ్యాధి ఉన్నవారికి తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీన్ని తగ్గించుకోవడానికి బీన్స్ బాగా పనిచేస్తుంది. బీన్స్ డయాబెటిస్ రోగులకు సూపర్ ఫుడ్. బీన్స్ లో చాలా తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. చక్కెర స్థాయిని అదుపు చేయడానికి ప్రొటీన్, ఫైబర్ బాగా ఉంటాయి.
బీన్స్ లో రకరకాలైనవి ఉంటాయి. పింటో బీన్స్, బ్లాక్ బీన్స్ లేదా రెడ్ కిడ్నీ, బీన్స్, తిన్న టైపు 2 డయాబెటిస్ ఉన్న రోగుల రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. బీన్స్ తిన్న 90,120, 150 నిమిషాల తరువాత రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా చేస్తాయి. బీన్స్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
బీన్స్ అన్నం లేదా రొట్టెలతో తినొచ్చు. దీన్ని సలాడ్, సూప్ లు కూడా వాడుకోవచ్చు. బీన్స్ నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి వెల్లుల్లి, అల్లంతో కలిపి తినాలని చూస్తుంటారు. ఇలా బీన్స్ తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయని వైద్యలు సూచిస్తున్నారు.