34.7 C
India
Friday, April 10, 2026
More

    విదేశాలకు వెళ్లాలంటే రైళ్లలో కూడా వెళ్లొచ్చు?

    Date:

    train
    train

    విదేశాలకు వెళ్లాలనే కోరిక అందరికి ఉంటుంది. అందుకు తగిన పరిస్థితులు వస్తే ఎవరు కూడా వదులుకోరు. కాకపోతే విమాన చార్జీలు మోతమోగిస్తాయి. ఈ నేపథ్యంలో విదేశాలను చుట్టి రావాలనే కోరిక మనసులోనే అణచుకుంటారు. కానీ మనదేశంలోని కొన్ని రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. మన దేశం నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ద్వారా నడిచే రైళ్లు నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వెళ్తుంటాయి. వాటిలో మనం ఆ దేశాలు చుట్టి రావచ్చు.

    కోల్ కతా రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ వెల్లే బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ రైల్వేస్టేషన్ లో ఆగుతుంది. ఇది బంగ్లాదేశ్ వెళుతుంది. ఇందులో మనం బంగ్లాదేశ్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు వీసా, పాస్ పోర్టు కూడా ఉండాలి. ఇలా మనం బంగ్లాదేశ్ వెళ్లి రావచ్చు.

    బీహార్ లోని జయనగర్ రైల్వేస్టేషన్ మధులని జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచి నేపాల్ వెళ్లొచ్చు. జనక్ పూర్ వద్ద కుర్తా స్టేషన్ ద్వారా నేపాల్ కు అనుసంధానించారు. రెండు దేశాల మధ్య ప్యాసింజర్ రైలు నడిపిస్తున్నారు. ఈ రైలు ద్వారా మనం నేపాల్ వెళ్లడానికి పాస్ పోర్టు కానీ వీసా కానీ అవసరం లేదు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. మనం స్వేచ్ఛగా తిరిగి రావచ్చు.

    ఢాకా వెళ్లాలంటే మిథాలీ ఎక్స్ ప్రెస్ లో న్యూజల్ పైగురి జంక్షన్ నుంచి వెళ్లొచ్చు. హల్దీబారి రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్లు భారత సరిహద్దు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్హతి రల్వే స్టేషన్ ద్వారా ఇది బంగ్లాదేశ్ కు అనుసంధానించారు. దీని ద్వారా మనం ఢాకా వెళ్లి రావచ్చు.

    పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దివాజ్ పూర్ జిల్లాలో రాధికాపూర్ స్టేషన్ ఉంది. ఇది కతిహార్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. రాధికాపూర్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ లోని బిరల్ రైల్వే స్టేషన్ అనుసంధానించబడి ఉంది. ఇది ఇండో – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండటం వల్ల ఇక్కడనుంచి బంగ్లాదేశ్ చేరవచ్చు. ఇక్కడ నుంచి అస్సాం, బిహార్ ద్వారా బంగ్లాదేశ్ కు వస్తువులను రవాణా చేస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train : 3.5 కిలో మీటర్ల పొడవు.. 295 కోచ్ లు, 6 ఇంజిన్లు.. దేశంలో ఈ రైలు ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసింది తెలుసా?

    train : ప్రపంచంలోనే భారతీయ రైల్వేకు మంచి గుర్తింపు ఉంది. ప్రపంచలోనే...

    Train : రైలింజన్ పైకి ఎక్కిన బాలుడు.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

    Train : బాపట్ల రైల్వే స్టేషన్ లో మతి స్థిమితం లేని...

    Train Journey : ట్రెయిన్ జర్నీ కన్ఫమ్ కాలేదా.. మూడు రేట్లు రిటర్న్.. ఇది మీకోసమే?

    Train Journey :  ట్రెయిన్ జర్నీ.. ఒకప్పుడు ఈ ప్రయాణం అంటేనే...

    Train : రైళ్ల వెనకాల ఉండే x వందేభారత్ కు ఎందుకుండదో తెలుసా?

    Train :  మనదేశంలో రైల్వే వ్యవస్థ పటిష్టమైనది. మన రైల్వే వ్యవస్థ...