
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ రెండు వర్గాల తాము చాలా నష్టపోతున్నామని అంటున్నారు. అంటున్నది టీడీపీ, జనసేన నాయకులు, అలాగని అధికార పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ కూడా కాదు. ఆయన ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ ఉన్న వ్యక్తి ఆయనే Deputy CM పీడిక రాజన్న దొర. మరి ఆయన్నే ఇబ్బంది పెట్టే ఆ వర్గాలు ఏంటో చూద్దాం..
రాష్ట్రంలో కమ్మ, రెడ్డి వర్గాల వల్ల తన నియోజకవర్గం ఎంతో నష్టపోతుందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్వతిపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గానికి ప్రాతినధ్యం ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల తాము నియోజకవర్గంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆ రెండు కులాలకు చెందిన సెటిలర్ల వల్ల నియోజకవర్గం నష్ట పోతుందని విలేఖరుల సమావేశం పెట్టి మరి చెప్పారు.
సాలూరు నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ నియోజకవర్గంగా ప్రకటించాలని, ఈ విషయంపై జగన్ కలవబోతున్నట్లు తెలిపారు. అయితే షెడ్యూల్డ్ నియోజకవర్గంగా ప్రకటిస్తే ఈ వర్గాల డామినేషన్ కొంచెం తగ్గుతుందని అంటున్నారు. సాలూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్న రాజన్నదొర రెండోసారి కేబినెట్ విస్తరణలో జగన్ ఆయనకు డిప్యూటి సీఎం పదవి కట్టబెట్టారు.
అయితే నియోజకవర్గంపై రాజన్న దొర పూర్తిగా కోల్పోయి ఇలా మాట్లాడుతున్నారని పలువురు అంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యల ద్వారా షెడ్యూల్డ్ కులాల ఓట్లు గంపగుత్తగా ఓట్లు పడతాయని ఆలోచించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నియోజకవర్గంలోని మాట్లాడుకుంటున్నారు.






