T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.. అక్కడి కంటే అభిమానులు, ఆటగాళ్లు మాత్రం భారత్ లోనే ఎక్కువ. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇక్కడి క్రికెటర్లకు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఉన్నారు. ఇక భారత్ క్రికెట్ ఆడే స్టయిల్ కూడా అత్యద్భుతం. రెండు సార్లు వరల్డ్ స్టార్ గా ఇండియా నిలబడింది. ఇదంతా మనకు తెలిసిన విషయాలే.
ప్రస్తుతం T20 వరల్డ్ కప్ కు యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ ఉన్నా.. యూఎస్ఏలో మాత్రం వారి జనాభా ఎక్కువ. గత రాత్రి భారత్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ కొనసాగింది. ఈ సమయంలో అక్కడి ప్రవాసులు కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. భారత్ మాతృభూమి అయితే అమెరికా కర్మభూమి. ప్రతీ ప్రవాసుడికి రెండూ రెండు కళ్లలాంటివి ఎవరిని మెచ్చుకున్నా ఇబ్బందే.
కానీ ప్రవాసులు దీన్ని కేవలం క్రికెట్ గా మాత్రమే చూస్తున్నారు. ఫస్ట్ టైం అమెరికా జట్టు వరల్డ్ మ్యాచ్ ఆడుతుంది. కాబట్టి ఎంకరేజ్ చేయాల్సిందే. కానీ భారత్ మాతృభూమి కాబట్టి అటు వైపు ఉండక తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతీ బాల్, ప్రతీ బౌండరీని కేరింతలతో ఎంజాయ్ చేశారు. ఏ జట్టును పైకెత్తుకోలేదు.. ఏ జట్టును దింపనూ లేదు.
ఏ జట్టు గెలుస్తుందనేది కాకుండా. ద్వంద్వ వారసత్వ సంపదను అందిపుచ్చుకోవడం ముఖ్యం. రెండు వైపులా ఉత్సాహపరుస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. ప్రేమకు సరిహద్దులు లేవని చూపించారు. అయినప్పటికీ, ఒక పక్షాన్ని ఎంచుకోవలసి వస్తే, వారి హృదయం ఇప్పటికీ భారతదేశం వైపునకే వెళ్తుంది. ఇది వారి మాతృభూమితో శాశ్వత బంధానికి నిదర్శనం.