Keeda Cola Teaser :
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో సినిమాను నిర్మిస్తున్నాడు. కీడా కోలా అనే చిత్రంతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. ఇందులో బ్రహ్మానందం కీ రోల్ పోషిస్తున్నాడు. చాలా కాలం తరువాత బ్రహ్మానందాన్ని మళ్లీ తెర మీద చూస్తాం. ఇటీవల కాలంలో దాదాపు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫ్యాన్స్ ను ఆనంద పరచేందుకు సిద్ధమవుతున్నాడు.
సినిమాకు సంబంధించిన టీజర్ నేడు విడుదల చేశాు. బ్రహ్మానందం డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆయన నటన కూడా అలాగే ఉంటుంది. సినిమాలో సంభాషణలు గమ్మత్తుగా ఉన్నాయి. బ్రహ్మానందం సినిమాను ఎక్కడికో తీసుకుపోయే అవకాశం ఉంది. సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది.
టీజర్ విడుదలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో చిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాను చూపించాలని తాపత్రయపడుతున్నారు. టీజర్ లో బ్రహ్మానందం సెటైరికల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు అని బ్రహ్మానందం అంటే నువ్వు బతుకతలేవా అట్లనే అని చైతన్య అంటాడు. దీంతో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి.
బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ అవుతుంది. సినిమా టీజర్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. చాలా రోజులకు బ్రహ్మానందం మరోమారు తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయ్యాడు. ఇటీవల సినిమాల్లో అతడు కనిపించడం లేదు. ఈ సినిమాలో తనదైన కామెడీ పండించి మరోమారు తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాడు.