29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Director Teja : డైరెక్టర్ తేజ అందరి ముందే తిట్టాడు.. అభిరామ్ సంచలన ఆరోపణలు..!

    Date:

    Director Teja
    Director Teja

    Director Teja : నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవ్వడానికి రెడీ అవుతున్నాడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ తేజ ఇప్పుడు దగ్గుబాటి వారసుడిని లాంచ్ చేస్తున్నారు.. ఎన్నో ప్రేమ కథలను తేజ తీసాడు.. అవి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తున్నాడు..

    మరి అలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరామ్ పరిచయం కాబోతున్న సినిమా ”అహింస”.. అయితే ఈసారి తేజ డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు అని తెలుస్తుంది.. ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. ఇప్పటికే అహింస నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే అంచనాలను క్రియేట్ చేసింది.

    ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.. ఈ క్రమంలోనే అభిరామ్ ఇంటర్వ్యూలో పాల్గొన తేజ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.. తేజ నాన్నను కలిసి కథ చెప్పారు.. ఆ కథ నాకు బాగా సూట్ అవుతుంది అని నాన్న నమ్మి నన్ను తేజ గారికి అప్పగించారు. సినిమా షూట్ చేస్తున్నప్పుడు తేజ అందరి ముందు నన్ను మైక్ లో తిట్టారు..

    నీ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా నాకు సంబంధం లేదు.. నేను ఆడియెన్స్ కోసం ఈ సినిమాను చేస్తున్నాను.. కాబట్టి ఫోకస్ పెట్టి నటించు అంటూ ఈయన నాకు మొదటి రోజే వార్ణింగ్ ఇచ్చారు.. హీరోయిన్ ను ఎత్తుకుని పరిగెత్తే ఒక సన్నివేశం చేసేప్పుడు నేను పడిపోయాను. దీంతో దెబ్బలు తగిలి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సినిమాను ఇంట్లో చూపించగా కొన్ని చిన్న చిన్న సలహాలు చెప్పారు.. ఇక విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ నిద్ర పట్టడం లేదు.. కంగారుగా అనిపిస్తుంది అంటూ అభిరామ్ చెప్పుకొచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ahimsa Movie : బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టిన ‘అహింస’ ఎన్ని కోట్ల నష్టమంటే?

    Ahimsa Movie : దర్శకుడు తేజకు ఏమైందో తెలియదు గానీ.. మూవీ...

    Abhiram Ahimsa : అభిరామ్‌ను తీవ్రంగా హింసించిన తేజ.. అందు కోసమేనట..?

    Abhiram Ahimsa : దగ్గుబాటి అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న...

    Director Teja : ఆంధ్రాబ్యాంకును ఎందుకు తీసేశారు? దర్శకుడు తేజ సూటి ప్రశ్న

    Director Teja : ప్రముఖ దర్శకుడు తేజ గురించి అందరికి తెలుసు....