దర్శకుల స్టయిల్ మారింది. ఒకప్పుడు మూసగా ధోరణిలో పోతున్న సినిమాలను ఒక్క కుదుపుతో మార్చాడు రాం గోపాల్ వర్మ. ఆ ఒక్క సినిమాతోనే ఆయనకు సంచలన దర్శకుడు అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రపంభనం కొనసాగుతూ వచ్చింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కొత్త రక్తంతో ముందుకెళ్తుంది. సీనియర్ దర్శకులకంటే జూనియర్ డైరెక్టర్ల సినిమాలు బిగ్ హిట్ సాధించి భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతున్నాయి. అవేంటి ఆ డైరెక్టర్లు ఎవరు చూద్దాం..
ఇటీవల విడుదలైన విరూపాక్ష, దసరా, బలగం ఈ మూవీలు ఇప్పుడు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్నాయి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన ‘బలగం’ భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. ఊరంగా, బంధువులతో కలిసి సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన దసరా, విరూపాక్ష ఎక్కువ బడ్జెట్ అయినా పాన్ ఇండియా లెవల్ ఓ రిలీజై ప్రేక్షకుల మన్ననలు దక్కించుకున్నాయి. ఈ సినిమాల్లో హీరో హీరోయిన్ కంటే కథే ఎక్కువ హిట్ అయ్యిందని చెప్పచ్చు. ఈ మూడు మూవీస్ ఒక సిమిలారిటీ ఉంది. ముగ్గురు కూడా కొత్త డైరెక్టర్లు. డెబ్య్యూతో హిట్ కొట్టిన దర్శకుల గురించి తెలుసుకుందాం.
ఒకే ఒక జీవితం-శ్రీకార్తీక్
శర్వానంద్, రీతూవర్మ, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ దీనికి దర్శకత్వం వహించింది శ్రీకార్తీక్. తమిళంలో రెండు సినిమాలు తీసిన ఆయనకు తెలుగులో ఇది మొదటిది. దీంతో ఆయన మంచి హిట్ కొట్టారు. బ్లాక్ బస్టర్ హిట్ గా అప్పట్లో ఈ చిత్రం నిలిచింది.
bimbisara-
బింబిసార- మల్లిడి వశిష్ఠుడు
కళ్యాన్ రామ్ కు బిగ్ హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. ఇందులో హీరో డబుల్ రోల్ పోషించాడు. ఈ సినిమాకు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ కొట్టింది. కళ్యాన్ రామ్ కే కాకుడా దర్శకుడికి మంచి ప్రసంశలు దక్కాయి.
మసూద-సాయికిరణ్
కుటుంబ కథలు, ప్రేమ కథల కంటే హర్రర్ జోనర్ కోసం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అనుభవం లేని దర్శకుడి నుంచి ఇలాంటి సినిమాలను అస్సులు ఊహించలేం. దీంతో పాటు సౌండ్ మీద కూడా కొంత గ్రిప్ ఉంటేనే హర్రర్ సినిమాలు హిట్ అవుతాయి. మసూద సాయికిరణ్ కు డెబ్య్యూ మూవీ. మొదటి సినిమాతోనే ఆయన భయపెట్టించాడు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి హిట్ అయ్యాడనే చెప్పాలి.
రైటర్ పద్మభూషన్-షణ్ముఖ ప్రశాంత్
సుహాన్ ను హీరోగా పెట్టి తీసిన సినిమా రైటర్ పద్మభూషన్. ఈ మూవీతో షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఫ్యామిలీ డ్రామా, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ను జోడించి మంచి కథనే తీసుకువచ్చాడు. ఇది కూడా కొంత మేర బాగానే ఆడింది.
బలగం-వేణు యెల్దండి
వేణు వండర్స్ గా జబర్దస్త్ లో నవ్వులు పూయించిన వేణు యెల్దండి సినిమా అంటే అందరూ హాయిగా నవ్వు కోవచ్చు అనుకున్నారు. అవును నవ్వులతో పాటు సెంటిమెంట్ ను జోడించి కన్నీరు తెప్పించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు పర్యవేక్షణలో అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా విడుదలైంది. కానీ బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోయింది. పూర్తి ఫ్యామిలీతో కలిసి ఆనందంగా, బంధాలను గుర్తు చేసుకుంటూ చూడచ్చు. ఇది కూడా వేణుకు మొదటి సినిమానే..
dasara movie ott release date
దసరా-శ్రీకాంత్ ఓదెల
శ్రీకాంత్ ఓదెల తొలిచిత్రంతోనే బద్దలు బాషింగల్ చేసిండు. తెలంగాణ భాష, యాసను పూర్తిగా జొప్పించి బొగ్గుబాయి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన సనిమా ‘దసరా’. వరల్డ్ వైడ్ గా భారీ స్ర్కీన్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్లను కూడా రాబట్టింది. నాని కెరీర్ లో 100 కోట్లు మూవీ ఇదే కావడం విశేషం.
virupaksha
విరూపాక్ష-కార్తీక్ దండు
డిఫరెంట్ కటెంట్ తో వచ్చిన సినిమా విరూపాక్ష. ఈ వీక్ లో హిట్ మూవీ ఉందంటే అది విరూపాక్షనే. బైక్ యాక్సిడెంట్ తో గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ కు రీ ఎంట్రీతో మంచి హిట్ ఇచ్చిన సినిమా. మ్యూస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ తీసిన డైరెక్టర్ కార్తీక్ దండు. మొదటి చిత్రంతో మంచి హిట్ కొట్టాడు.