
YCP Mems : అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు భూమిపై కాలు నిలవలేదు. ఏ నేతను చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో ధూషించడం, మాట్లాడడం చేశారు. ఏదో ఒక రోజు ఎదుటి వ్యక్తికి కూడా ఛాన్స్ వస్తుంది కదా..? ఈ విషయాన్ని మరిచి మరీ తమ సొంత సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కామెంట్లు, ట్రోల్స్ చేసి సైలెంట్ గా ఉన్న పెద్ద పెద్ద సీనియర్ నాయకులకు సైతం చికాకు కల్పించారు. వారు అధికారం కోల్పోయిన తర్వాత ఆపోజిట్ పార్టీ నాయకులు కాకుండా.. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. శ్రీరెడ్డికి వైసీపీ అంటే ఎంత పిచ్చో ఏపీ మొత్తానికి తెలుసు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నెటిజన్లు, ట్రోల్స్ రాయుళ్లు ఆమెను ఆడుకుంటున్నారు. వైసీపీలో ఎక్కువ ఆదరణ ఉంది ఇద్దరికే.. అందులో ఒకరు జగన్ రెడ్డి భార్య భారతి ఆమెకు ఎలాంటి అధికారం లేకున్నా పార్టీ పెద్దలపై పెత్తనం చేస్తుంది. ఎందుకంటే ఆమె సీఎం భార్య హోదాలో చేస్తుందని అనుకోవచ్చు. కానీ శ్రీరెడ్డిని కూడా పార్టీ నాయకులు అందలం ఎక్కించారు. దీంతో ఇద్దరి గురించి ట్రోల్స్ మొదలయ్యాయి. ‘అంతర్యుద్ధం.. పార్టీకి మంచిది కాదు..’ అంటూ మీమ్ వైరల్ గా మారింది.
View this post on Instagram






