35.9 C
India
Thursday, March 28, 2024
More

    Disease X .. ప్రంచానికి మరో ముప్పు పొంచి ఉందా..?!

    Date:

    Disease X
    Disease X

    Disease X : ప్రపంచాన్ని అంటువ్యాధులు వదిలేయడం లేదు. కరోనా మహమ్మారి విధ్వంసం ఎలా ఉందో ఇప్పటికే చూశాం. తర్వాత మంకీ ఫాక్స్ అంటూ డిసీజ్ బయల్దేరింది. వీటి నుంచి ఇంకా బయట పడకముందే మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు వస్తున్నాయి. ఇటీవల బ్రిటన్ లోని మురికి నీటి నమూనాల్లో పోలియో వైరస్ గుర్తించడంతో డబ్ల్యూహెచ్ఓ తీవ్ర కలవరపాటుకు గురవుతుంది. ప్రతీ ఒక్కరూ పోలియో వాక్సినేటెడ్ కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటూ అధికారులు చెప్తున్నారు.

    బ్రిటన్ లోనే ఎక్కువ..?

    కరోనాతో వణికిపోయిన బ్రిటన్ లో మంకీఫాక్స్ మరో విలయం సృష్టించింది. ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయని, నమోదు కాని కేసులు ఇంకా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మాంకీఫాక్స్ కంటే ముందే క్రిమియన్-కాంగో ఫీవర్ కేసులు కూడా నమోదు కావడం బ్రిటన్ కలవరపాటుకు గురి చేస్తుంది. ఇటీవల లస్సా ఫీవర్, బర్డ్ ఫ్లూ వంటి కేసులు గతంలో బ్రిటన్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వీటిని గుర్తించిన సైంటిస్టులు రానున్న రోజుల్లో మరిన్ని అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ వంటి కొత్త వేరియంట్లు వ్యాపించే ఛాన్స్ ఉందని వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

    అసలు ఎంటీ డిసీజ్ ‘ఎక్స్‘..

    డిసీజ్ ఎక్స్ అంటే ఇందులో ఎక్స్ అనే పదం భవిష్యత్ తో సంభవించే అంటువ్యాధులను సూచిస్తుంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా అంటు వ్యాధులు తీవ్రమవుతాయి. అది ఏ రకమైన వైరస్ అనే దాని గురించి కచ్చితంగా చెప్పలేకున్నా వ్యాధి వ్యాప్తి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రస్తావించింది. డీసీజ్ ఎక్స్ ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధి, ఒక వేళ ఇది సంభవిస్తే ప్రపంచం కరోనా కంటే ఘోరమైన విపత్తును ఎదుర్కోవచ్చు. అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (గత మార్చి) తెలిపింది.

    కరోనా కంటే డేంజరా..?

    జంతువుల నుంచి మానవులకు సోకే ఎన్నో రకాల వ్యాధులు రానున్న రోజుల్లో మరింత వినాశనం సృష్టించవచ్చని గతంలో ఎంతో మంది స్పష్టం చేశారు. 21వ శతాబ్దం ప్రారంభంలో అంటు వ్యాధులు ఓ తుపానులా విరుచుకుపడ్డాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని హెచ్చిరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. అంటూ ఈడెన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ పూల్ హౌజ్ పేర్కొన్నారు.

    ‘ప్రస్తుతం మనం సరికొత్త రోగకారక జీవుల యుగంలో జీవిస్తున్నాం. డిసీజ్ ఎక్స్ కూడా అందులోని ఒక రోగకారకమే’. 1976లో ఎబోలాను కనుక్కోవడంలో కీలకపాత్ర వహించిన ప్రొఫెసర్ జీన్ జాక్యూస్ ముయేంబే టామ్ ఫమ్ గతేడాది హెచ్చరించారు. ఇవి మానవాళికి ముప్పు కలిగించేవే. కొవిడ్ కంటే మరింత ప్రమాదకరమైన వ్యాధులు ఉద్బవిస్తాయి అనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ అవును అలాంటివి కచ్చితంగా వస్తాయనే నేను భావిస్తున్నా అంటూ చెప్పారు. భవిష్యత్ తో వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    దేశంలో కొత్తగా 602 కరోనా కేసులు

      దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 602...

    అమెరికా వెళ్లాలంటే ఇక మీదట కరోనా టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు

    కొవిడ్ 2019లో వెలుగు చూసింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. రెండేళ్ల పాటు మనుషుల...