Disney Sell Hotstar : ఓటీటీ ప్లాట్ ఫారంలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ ఫారం ‘డిస్నీ+హాట్‌స్టార్’. డిస్నీ భారీ కంటెంట్లను ఏర్పాటు చేసుకుంటూ పోతోంది. ఇక దీనికి సంబంధించి ఒరిజినల్ సిరీస్ లు కూడా ఎక్కువనే చెప్పవచ్చు. ఇండియాలో దీనికి బాగా ఆదరణ ఉంది. డిస్నీతో పాటు స్టార్ నెట్ వర్క్ కలిసి దీన్ని తెచ్చాయి. స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
గతంలో హెచ్‌బీవోతో ఒప్పందం చేసుకున్న డిస్నీ+హాట్‌స్టార్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ఎనిమిది సీజన్లతో ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల హెచ్‌బీవోతో డిస్నీ+హాట్‌స్టార్ గడువు ముగియడంతో ఆ ప్లాట్ ఫారం నుంచి హెచ్ బీవో వైదొలగింది.
హెచ్‌బీవో ప్రస్తుతం రియలన్స్ ‘జియో’తో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది. ఈ ఒప్పందం కుదిరితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇండియాలోని పలు భాషల్లో ముందుకు రానుంది. ఇదంతా పక్కన ఉంచితే ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ కూడా తమ ప్లాట్ ఫాం కొనుగోలుకు ‘జియో’తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ను తీసుకోవాలని జియోను కోరుతుందట.
ఈ ఒప్పందం కూడా సక్సెస్ అయినా డిస్నీ+హాట్‌స్టార్ పోయి ‘జియో సినిమా’ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇండియా ఓటీటీ ప్లాట్ ఫాంకు శుభపరిణామం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక క్రికెట్ లాంటివి కూడా జియోలో ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంది.