30.6 C
India
Monday, May 12, 2025
More

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Date:

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత ప్రియమో అందరికీ తెలిసిందే. కోరిక కోర్కెలు తీర్చాలంటే కోడె మొక్కలు పెట్టాల్సిందే. అయితే కొందరు భక్తులు రాజన్నకు కోడెలను మొక్కుగా అప్పగిస్తుంటారు. ఆ కోడెలను స్వామి వారి ఖజానా నుంచి వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. అయితే వాటి సంఖ్య ఎక్కువ కావడంతో వాటిని పంపిణీ చేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బాధ్యతను కలెక్టర్ కు అప్పగించింది.

    వేములవాడ గోశాల నుంచి అదనపు ఆవులు, కోడెల ఉచిత పంపిణీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. తన ఛాంబర్ లో ఆలయ గోవుల ఉచిత పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.

    కలెక్టర్ మాట్లాడుతూ.. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు సమర్పించిన ఆవులు, కోడెలు ఆలయ గోశాలలో ఉన్నాయని వీటి సంఖ్య పెరగడం మూలంగా అర్హులైన రైతులు, ఆలయ గోశాలలు, ప్రైవేట్ గోశాలలు, గోమాత భక్తులకు అదనపు కోడెలు, ఆవులను ఉచితంగా అందజేస్తామన్నారు. అందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

    దరఖాస్తులు రాకపోతే రైతు సంఘాలు లేదంటే సొసైటీలకు అవకాశం ఇస్తామని, కోడెలు గోవులు కావలసినవారు కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

    ప్రస్తుతం దేవస్థానానికి ఏడాదికి సుమారుగా 2500 కోడెలను భక్తులు సమర్పిస్తారని, ఆలయం వద్ద 450 నుంచి 500 వరకు కోడెలను నిల్వ ఉంచుకొని, మిగతావి వివిధ గోశాలలకు, అర్హులకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్తున్నారు.

    ఉచిత గోవులకు సంబంధించి దరఖాస్తుల సమాచారం ఆన్ లైన్, గూగుల్ లింక్, దేవస్థానం వెబ్ సైట్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచాలన్నారు. అర్హులకు కోడెలు, ఆవులు ఏ విధంగా పంపిణీ చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఉద్యోగులను ఆదేశించారు.

    రాజన్న సన్నిధి గోశాల నుంచి పంపిణీ చేసే ప్రతీ కోడె, ఆవుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య రిపోర్ట్ 3 కాపీలు సిద్ధం చేయాలని, ఒక కాపీ లబ్ధిదారుడికి, రెండో కాపీ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి, మూడో కాపీ సిరిసిల్ల జిల్లా పశు సంవర్థక శాఖ వద్ద ఉంచాలన్నారు. పంపిణీ చేసిన పశువులను పశుసంవర్ధక శాఖ నుంచి వైద్యులు వెళ్లి కొన్ని రోజులు పరీక్షలు చేస్తారని తెలిపారు. ఈ కోడెలు, ఆవుల పట్ల నిర్లక్ష్యం వహించినా, వీటిపై హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related