29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Diversion Media : డైవర్షన్ మీడియా పాలిటిక్స్.. వైసీపీ మాస్టర్ స్కెచ్?

    Date:

    Diversion media
    Diversion media

    Diversion media : మహానాడు తో నూతనోత్సాహాన్ని అందుకున్న టీడీపీని డైవర్ట్ చేసేందుకు ఏపీ అధికార పార్టీ, మీడియా కొత్త ప్రచారాలకు తెర తీసింది. తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో పై ప్రజల్లో జోరుగా చర్చ సాగుతున్నది. ఇది అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. దీంతో ఎలాగైనా ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు అధికార పార్టీ అనుకూల మీడియా కొత్త రాగం అందుకుంది. కొద్ది రోజుల క్రితం రామోజీరావు  కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లో సీబీఐ సోదాలు చేసిన విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మార్గదర్శి వ్యవహరించిందని సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే మార్గదర్శి ఆస్తులను సీఐడీ అటాచ్ చేసిందనే ప్రచారాన్ని అధికార పార్టీ అనుకూల మీడియా  పతాక స్థాయికి తీసుకెళ్తున్నది.

    ఏపీ సీఐడీకి ఆస్తులు అటాచ్ చేసే అధికారం లేదన్న విషయం తెలిసిందే. కానీ ఆస్తులు అటాచ్ అంటూ  ఓ వర్గం మీడియాను అడ్డం జోరుగా ప్రచారం చేస్తున్నది. ఇదంతా టీడీపీ మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో డైవర్షన్ కోసమనే తెలుస్తున్నది. మూడు వారాల క్రితం బాబు కరకట్ట హౌస్ ను జప్తు చేశాయని హడావిడి చేశారు.  నారాయణ ఆస్తులను జప్తు చేశాయని ప్రచారం చేశారు.  కానీ సీఐడీ విడుదల చేసిన ఉత్తర్వులు పరిగణనలో రావనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే కోర్టుకు వెళ్లలేదు. ఇప్పుడు ఇలా మార్గదర్శిపై తప్పుడు ప్రచారం లేవనెత్తారు. ఇలా ఇష్టారీతిన ప్రైవేట్ ఆస్తులను అటాచ్ చేసే సీఐడీకి లేదు. ప్రభుత్వం ఉదహరిస్తున్న బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారమే కోర్టు అనుమతితోనే జప్తు చేయాలి.

    కానీ ఇప్పుడు ..కేవలం సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. ఆ అనుమతితో సీఐడీ కోర్టుకెళ్లి.. తప్పు చేశారని..ఆ ఆస్తులు స్కామ్ ద్వారానే సమీకరించుకున్నారని.. నిర్ధారించుకుంటే అప్పుడు జప్తుకు కోర్టు ఆదేశాలిస్తుంది. ఆ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు చేయరాదు. అసలు మార్గదర్శి విషయంలో ఏం తప్పు జరిగిందో ఇప్పటికీ సీఐడీ చెప్పలేదు. ఒక్క బాధితుడు కూడా లేడు. చిట్స్ ద్వారా వచ్చిన లాభాలను మార్గదర్శి దేనికి వాడుకుందో సీఐడీ ఎందుకో చెప్పడం లేదు.

    రోజుల తరబడి సోదాలు చేసినా కోర్టులో ఫలానా తప్పు జరిగినట్లు మాత్రం సీఐడీ చూపలేకపోయింది. కానీ అధికార అనుకూల మీడియాలో మాత్రం చేస్తున్న ప్రచారం ఓ రేంజ్ లో సాగుంది. ఈ విషయంలో కొన్ని చానెళ్లు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో జగన్ పేరు ఉందని  బాకా మీడియా సాహసించదు. పనికి రాని ఉత్తర్వులతో తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం బానిస మీడియ ముందుంటున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayasai Reddy : టీడీపీ ఎంపీల మాదిరిగానే.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. బీజేపీలో చేరిక.. ప్లాన్ అదే

    వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు...

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...

    Vijayamma: కొడుకూ, కూతురు మధ్య అగాధాన్ని విజయమ్మ పూడ్చగలదా..?

    Vijayamma: కొన్ని రోజులుగా జగన్, షర్మిల మధ్య ఆస్తివ్యవహారం ఏపీ అంతా...

    YCP : అంతర్యుద్ధంపై వైసీపీలో చర్చ.. వీరి మధ్యనేనా..?

    YCP Mems : అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు భూమిపై...