
DK revenge after he cried : కర్ణాటక ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. మ్యాజిక్ పిగర్ ను దాటి 23 సీట్లను కైవసం చేసుకుంది హస్తం పార్టీ. అయితే ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధినేత డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ఏడ్చేశాడు. కర్ణాటకలో పార్టీని గెలిపించి, ప్రభుత్వంలోకి తెస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డీకే శివ కుమార్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నించారు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు ఉద్యమాలు చేశారు. ప్రజల చూపు కాంగ్రెస్ వైపు మల్లేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నింటిలో ఆయన సక్సెస్ అవుతూ వచ్చారు.
‘కన్నడనాట కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు తీసుకెళ్తానని సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునా ఖర్గేకు మాట ఇచ్చానని, నేను జైలులో ఉన్న సమయంలో సోనియాగాంధీ నన్ను కలిసేందుకు వచ్చారు. దానిని నేను ఎన్నటికీ మర్చిపోలేను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ మీడియా ప్రశ్నించడంతో ‘కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం. అక్కడ మేం తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మీడియా ముఖంగా సిద్ధరామయ్యతో పాటు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు కూడగొట్టుకోవడంలో సక్సెస్ అయ్యాం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రుల మంత్రాంగం ఇక్కడ పారలేదన్నారు. ఇది సమష్టి నిర్ణయం అంటూ మల్లికార్జున ఖర్గే అన్నారు.