Salary Account : ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులు పరిస్థితులను బట్టి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. ఇది సహజమైన ప్రక్రియనే కదా. ఇక వారి మంత్లీ సాలరీ (వేతనం) కోసం బ్యాంకులో అకౌంట్ తీయిస్తారు. ఒక కంపెనీ ఒక బ్యాంకుతో టైఅప్ పెట్టుకుంటే మరో కంపెనీ మరో బ్యాంక్ తో టైఅప్ పెట్టుకుంటుంది. ఇలా వారి అనుబంధ బ్యాంకుల్లో ఎంప్లాయీస్ కు సాలరీ క్రెడిట్ అవుతూ ఉంటుంది.
ఒక కంపెనీలో పని చేసే ఎంప్లాయ్ ఏదైనా కారణంతో ఆ కంపెనీ నుంచి వెళ్లిపోయి మరో కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ లింక్ అప్ బ్యాంకులో ఖాతా తీస్తాడు. అయితే మొదటి కంపెనీకి సంబంధించి బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయకుండా అలాగే ఉంచుతాడు. దీంతో చాలా ప్రాబ్లామ్స్ ఎదుుర్కోవాల్సి ఉంటుంది. ఖాతాల్లో సాలరీ ఖాతా కూడా ఒకటి. ఈ అకౌంట్ లో మినిమం ఉండ వలసిన అవసరం లేదు.
కంపెనీ మారిన తర్వాత మొదటి కంపెనీకి సంబంధించి అకౌంట్ ను తొలగించుకోకపోవడంతో అది అటోమెటిక్ గా సేవింగ్ ఖాతాలోకి పడిపోతుంది. సేవింగ్ ఖాతాలో మినిమం మేయిన్ టైన్ చేయాలి. లేదంటే సదరు బ్యాంకులు పెనాల్టీలపై పెనాల్టీలు వసూలు చేస్తాయి. ఈ అకౌంట్ లో ఎప్పుడు డబ్బులు పడ్డా అవి కట్ అవుతాయి. ఇలా సాలరీ ఖాతాను ఎక్కువ కాలం హోల్డ్ లో పెడితే తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి కంపెనీ మారిన వెంటనే అకౌంట్ క్లోజ్ చేసుకుంటే బాగుంటుందని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.