36.5 C
India
Friday, April 10, 2026
More

    వ‌డ‌గ‌ళ్ల వాన‌లు ప‌డొచ్చు.. బ‌య‌ట‌కు రావొద్దు..!

    Date:

    hai stroms
    hai stroms

    తెలంగాణలోని ప‌లుజిల్లాల్లో మ‌ళ్లీ వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ ఉద‌యం నుంచే హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింది. భారీగా కురిసిన వ‌ర్షాల వ‌ల్ల రోడ్ల‌న్ని జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. అధిక వ‌ర్షాల వ‌ల్ల ర‌హ‌దారుల‌పై ప‌రిస్థితులు అస్త‌వ్య‌స్తంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు రోడ్ల‌పై విరిగి ప‌డ్డాయ‌. దీంతో సిటీలోని అనేక చోట్ల ట్రాపిక్‌కు అంత‌రాయం క‌ల్గి..వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

    మ‌రోవైపు హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి ఇలా ఉంటే వాతావ‌ర‌ణ శాఖ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పిడుగులాంటి వార్త చెప్పింది. ప‌బ్లిక్ అల‌ర్ట్‌గా ఉండాల‌ని రాష్ట్రంలో మ‌రోసారి వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షం ప‌డే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఉమ్మ‌డి మెద‌క్,రంగారెడ్డి జిల్లాల‌తో పాటు ఇత‌ర జిల్లాల్లో కూడా రాళ్ల వాన ప‌డేందుకు అవ‌కాలున్నాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు శ‌నివారం వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను జారీ చేసింది.

    రాళ్ల వాన దృష్ట్యా గాలుల తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొంది. గంట‌కు 40-50 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అక్క‌డ‌క్క‌డ పిడుగులు కూడా ప‌డే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. అందువ‌ల్ల ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించింది. అలాగే రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

    కోసిని ధాన్యాన్ని రైతులు బ‌హిరంగంగా ఆర‌బెట్టొద‌ని తెలిపింది. వెంట‌నే ఆ ధాన్యాన్ని గిడ్డంగుల‌కు త‌ర‌లించ‌డ‌మో.. లేక‌..వాటిపై పాలిథిన్ క‌వ‌ర్లు క‌ప్పి ఉంచ‌డ‌మో చేయాల‌ని తెలిపింది. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులున్న అధికారుల‌ను వెంట‌నే సంప్ర‌దించాల‌ని సూచించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monsoon : ఏపీలోకి రుతుపవనాల ఎంట్రీ – నాలుగు రోజుల వానలు

    Monsoon in AP : ఏపీలో చల్లటి వాతావరణానికి బాట పడుతోంది. నైరుతి...

    Big alert : ఏపీలో ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!

    Big alert : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు భగ్గుమనే ఎండలు,...

    Weather : తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

    Weather Report : రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత...

    Temperatures : 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. మార్చిలో నిప్పుల కొలిమి..

    Temperatures : 1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి...