
మన దైనందిన కార్యక్రమాల్లో స్నానం కూడా ఒకటి. కాకపోతే కొందరు రోజుకు ఒకసారి చేస్తారు మరికొందరు మాత్రం రెండుసార్లు చేయడం సహజం. ఈ నేపథ్యంలో స్నానం మనుషులకు ప్రధానమే. స్నానం చేయడంలో కొందరిది ప్రత్యేకం. ప్రతి ఒక్కరు స్నానం చేయడం అలవాటు చేసుకుంటారు. కాకపోతే స్నానం చేసిన తరువాత కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయి.
స్నానం చేసిన వెంటనే తల దువ్వుకోవడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జట్టు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా టవల్ ను జుట్టుకు బలంగా రుద్దకూడదు. శరీరానికి సున్నితంగా మర్ధన చేయాలి. కానీ గట్టిగా రుద్దడం వల్ల ఇబ్బందులు రావడం సహజం. స్నానం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని తెలుసుకోవాలి.
స్నానం చేసిన తరువాత తక్షణమే కాస్మోటిక్ పౌడర్లు రాయవద్దు. ఇలా రాస్తే మన శరీరం వాటిలో ఉండే రసాయనాలతో నిర్జీవంగా మారుతుంది. సేంద్రియ ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం. మహిళలు తలస్నానం చేసిన తరువాత జుట్టుకు టవల్ గట్టిగా కడతారు. ఇది కూడా సరైంది కాదు. దీని వల్ల వెంట్రుకల చివర్లు దెబ్బ తింటాయి.
కొందరు రోజు స్నానం చేస్తారు. మరికొందరు మాత్రం రోజు చేయరు. అప్పుడప్పుడు చేస్తారు. ఇది అనారోగ్యకరం. దీంతో స్నానం చేయడం ఓ ప్రహసనంగా చేయడం మంచిది. ఈ నేపథ్యంలో స్నానం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే స్నానం చేసిన తరువాత ఇలాంటి పనులు చేయడం సురక్షితం కాదని తెలుసుకోవాలి.






