
beer guide : ఎండాకాలంలో చల్లని బీరు వేయాలని చూస్తారు. దీంతో బీరు తాగి తమ దాహం తీర్చుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో బీరు తాగేటప్పుడు కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. అల్కహాల్ తీసుకుంటే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే అల్కహాల్ తాగేవారు నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో మద్యం ప్రియులు తాగే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బీరు తాగేటప్పుడు కారం కారంగా తినాలని అనిపిస్తుంది. అందుకే స్పైసీగా ఏదో ఒకటి తింటుంటారు. ఇది కరెక్టు కాదు. బీరు తాగే సమయంలో కారం ఉన్నవి తీసుకుంటే కడుపులో ఇబ్బంది కలుగుతుంది. బీరు తాగేటప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటివి తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకుని తీసుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు వస్తాయి.
బీరు తాగే సమయంలో మసాలాలతో కూడినవి తీసుకోవడం మంచిది కాదు. మసాలా దట్టించిన వాటిని తీసుకుంటే శరీరంపై ప్రభావం పడుతుంది. కడుపును చికాకు పరుస్తాయి. వాంతులు కూడా కావచ్చు. కారంగా ఉన్నవి కూడా తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. బీరు తాగేటప్పుడు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినొద్దు. ఇవి జీర్ణ వ్యవస్థకు చెడు చేస్తాయి.
అల్కహాల్ తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే ఎక్కువగా మంచినీరు తాగాలి. కానీ ఇతర వాటిని తీసుకుంటే ఇబ్బందే. అల్కహాల్ ఎక్కువగా తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఒంట్లో ఉన్న నీరు మొత్తం బయటకు పోతుంది. దీని వల్ల కూడా శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల కూడా ఇబ్బందులొస్తాయి.