26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Rakhi : సోదరి కట్టిన రాఖీ విషయంలో ఈ తప్పులు చేయద్దు..

    Date:

    Rakhi
    Rakhi

    Rakhi : శ్రావణంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ రాఖీ (రక్షా బంధన్). సోదరి సోదరుడికి రాఖీ కట్టి నువ్వు నాకు అండ అంటూ చాటుతుంది. ఈ రోజు సోదరి సోదరుడి దీర్ఘాయువును కోరుతూ సంతోషకరమైన జీవితం గడపాలని మణికట్టుకు రాఖీ కడతారు. తర్వాత సోదరులు సోదరీమణులకు బహుమతులిస్తారు. మంచి, చెడులో సోదరీమణులకు అండగా ఉంటామని సోదరులు వాగ్ధానం చేస్తారు. రాఖీ రోజు సోదరులు ఉత్సాహంతో రాఖీని కట్టించుకుంటారు. ఒకటి, రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు.

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాఖీని పడవేయడం తప్పు ఈ తప్పు చేయద్దు. ఇలా చేయడం అశుభం. రక్షా బంధన్ పండుగ తర్వాత ఎన్ని రోజుల పాటు రాఖీని ఉంచుకోవాలి.. తర్వాత ఏం చేయాలని శాస్త్రంలో ఉందో తెలుసుకుందాం.

    రాఖీ కట్టడానికి శుభ సమయం  
    * హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం రక్షా బంధన్ ఆగస్టు 19వ తేదీ జరుగుతుంది. ఈ సారి రాఖీ పండగకు భద్ర నీడ ఉంది. కనుక ఈ ఏడాది రక్షా బంధన్ మధ్యాహ్నం 1.30 తర్వాత జరుపుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
    * మధ్యాహ్నం 1.46 గంటల నుంచి 4:19 గంటల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం.
    * సాయంత్రం శుభ సమయం: సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07 వరకు.

    రాఖీ కట్టేప్పుడు ఈ దిశలో ముఖం ఉండాలి..
    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రక్షా బంధన్ రోజు రాఖీ కట్టించుకునేందుకు సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం శుభప్రదం. ఈ సమయంలో సోదరి పడమర ముఖంగా ఉంటూ రాఖీ కట్టాలి. రాఖీ కట్టే ముందు సోదరుడికి కుంకుమ బొట్టు, కొన్ని సంప్రదాయాల్లో చందనంతో తిలకం దిద్ది.. ఆ తర్వాత తలపై అక్షతలు వేయాలి. దీని తర్వాతే రాఖీ కట్టాలి.

    రాఖీని ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలి..
    రక్షా బంధన్ లో సోదరి కట్టిన రాఖీని ఒకటి లేదంటే రెండు రోజుల్లో తీసేయరాదు. కనీసం 21 రోజులు ఉంచుకోవాలి. ఇన్ని రోజులు వీలుకాకుంటే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా రాఖీని ఉంచుకోవాలి.

    రాఖీ తీసిన తర్వాత ఏం చేయాలి?
    శాస్త్రం ప్రకారం.. రాఖీని తీసేసిన తర్వాత ఎక్కడ బడితే అక్కడ పారవేయద్దు.. ఆ రాఖీని ఎర్రటిగుడ్డలో చుట్టి పవిత్రమైన స్థలంలో.. లేదంటే మీ సోదరికి సంబంధించిన వస్తువుల్లో ఉంచాలి. మళ్లీ వచ్చే రాఖీ పండగ వరకు ఉంచండి. తర్వాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి. రాఖీ విరిగిపోయినా లేదా చినిగిపోయినా రూపాయి నాణెంతో పాటు చెట్టు మూలన పాతిపెట్టాలి.

    Share post:

    More like this
    Related

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : అందరికీ అన్నయ్య’గా మారిన కేటీఆర్.. రాఖీలతో నింపేశారు.. వైరల్ వీడియో చూడాల్సిందే

    KTR : రాఖీ పండగ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్...

    Rakhi Festival : రాఖీ పండగ..  ఈ సారి గిఫ్ట్ ఇలా ప్లాన్ చేసుకోండి

    Rakhi Festival 2024 : రక్షా బంధన్ అంటేనే అన్నా చెల్లెళ్లు,...

    Rakhi Day : రాఖీ రోజున ఆకాశంలో అద్భుతం., ఈ నాలుగు రాశుల వారికి ఇది సిద్ధించనుందట..

    Rakhi : ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 19వ తేదీన...

    Movies With Festival Names : మన పండగల పేర్లతో వచ్చిన సినిమాలేంటో తెలుసా?

    Movies With Festival Names : మన భారతీయులకు పండగలంటే ఇష్టం....