వాస్తు శాస్త్రం ప్రకారం.. లక్ష్మి దేవి ఫొటో లేదా విగ్రహాన్ని ఇంటిలో సరైన దిశలో ఉంచడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దీని వల్ల ఇల్లు, ఆఫీస్ లో కనక వర్షం కురుస్తుంది. కోరికలు నెరవేరుతాయి.
ఇంతటి సౌభాగ్యం ఇచ్చే లక్ష్మీ అమ్మవారి ఫొటోను తప్పుదిశలో ఉంచితే పూజ ఫలితం దక్కదు. లక్ష్మి దేవి ఫొటోను కొన్ని దిశల్లో ఉంచడం వాస్తు శాస్త్ర ప్రకారం నిషేధించబడింది. అమ్మవారి ఫొటోను తప్పు దిశలో పెడితే కుటుంబంలో కలహాలతో పాటు ఆర్థిక సంక్షోభం కలుగుతందట. దనవంతుడు పేదవాడుగా మారుతాడట. కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి ఫొటోను ఏ దిక్కున పెట్టుకుంటే చాలా శ్రేయస్కరమో, ఏ దిక్కున పెట్టకూడదో తెలుసుకుందాం.
పొరపాటున కూడా ఈ దిశలో పెట్టద్దు
వాస్తుశాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి ఫొటోను దక్షిణ దిశలో ఉంచడం మంచిది కాదు. ఈ దిక్కు మృత్యువు, యముడికి స్థానం. ఈ దిశలో అమ్మారి ఫొటోను ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పోతుంది, శాశ్వత పేదరికం స్థిరపడుతుంది.
అమ్మవారు నిల్చున్న భంగిమ ఫొటో పెట్టుకోవద్దు.. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారి స్వభావం చంచలమైనది. లక్ష్మీ అమ్మవారికి ఉన్న పేర్లలో ఒక పేరు ‘చంచల’. ఇంట్లోకి సిరి సంపదలు రావాలంటే లక్ష్మీదేవి కూర్చున్న ఫొటోను మాత్రమే ఏర్పాటు చేయాలి.
ఈ దిశలో పెట్టడం శుభప్రదం..
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి విగ్రహం, ఫొటోను పెట్టడానికి ఉత్తర దిశ శుభప్రదమైనది. ఇదే కాకుండా ఇతర దిశల్లో కూడా ఉంచవచ్చు. ఇది అమ్మవారిని పూజించే ఉద్దేశ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఉత్తర దిశ..
ఉత్తర దిశను సంపద దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో విగ్రహం, ఫొటో ఉంచడం వల్ల సంపద కలుగుతుంది. కాబట్టి, వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫొటో ఉత్తర దిశలో ఉంచాలి.
తూర్పు దిశ..
తూర్పు దిశను ధర్మం, భగవంతుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫొటోను ఉంచడం వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి.
ఈశాన్య దిశ..
ఈ దిశను సంపద, శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీదేవి దిశగా పిలుస్తారు. ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫొటోను ఉంచడం వల్ల ఇంట్లో సిరి, సంపదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది.