
Summer Tips : వేసవి కాలంలో డీహైడ్రేషన్ చాలా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివిధ కారణాల వల్ల తగినంత నీరు త్రాగకపోతే మీ మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని, అలాగే దోసకాయ మరియు పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచించారు. జ్యూస్‌లు కూడా మంచి ఎంపిక. మీకు దాహం లేకపోయినా క్రమం తప్పకుండా నీరు త్రాగటం చాలా ముఖ్యం. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు మరియు ప్యాక్ చేసిన డ్రింక్స్‌ను తగ్గించాలని సూచిస్తున్నారు.