
Meat : హైదరాబాద్ మంగళహాట్ చిస్తీ చమాన్ లో ఓ మేక మాంసం దుకాణం పై బుధవారం సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మహమ్మద్ అఫ్రోజ్ (40)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద పాయ, తలకాయ, బ్రెయిన్, కిడ్నీ, మేక గొర్రె లివర్ సుమారు 12 టన్నుల బీఫ్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అఫ్రోజ్ చెడిపోయిన మేక గొర్రెల మాంసాన్ని చిస్తీ చమాన్ లోని దుకాణం లో ఫ్రిజ్ లో నిల్వ చేసి తక్కువ ధరకే హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.