
అభిమానానికి హద్దుల లేవంటే నిజమే అనిపిస్తుంది. సావిత్రి కాలంలో గుండెల్లో గుడి కట్టి మరీ ఆరాధించేవారు. రాను రాను వ్యవస్థ మారింది. దీంతో నిజంగా గుడి కట్టించి అందులో తన అభిమాన నటీమణి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించడం మొదలు పెడుతున్నారు. ఈ సంప్రదాయం కుష్బూకు గుడి కట్టించడంతో ప్రారంభమైంది. ఆమె విగ్రహాన్ని అందులో ప్రతిష్టించి ఆరాధించాడు. తర్వాత నమిత, హన్సికలకు కూడా అభిమానులు గుడి కట్టించి ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ క్రెడిట్ సినిమా హీరోయిన్లకే దక్కడ విశేషం. ఈ మధ్య ఒక అభిమాని మరో టాలీవుడ్ హీరోయిన్ కు గుడి కడుతున్నాడు. ఆమె విగ్రహం కూడా తయారు చేయిస్తున్నాడు. ఆ విశేషాలు తెలుసకుందాం.
బాపట్ల జిల్లా, ఆలపాడ్ కు చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. ఆమె చేసిన ప్రతీ సినిమా చూసేవాడు. ఆమె నటన అన్నా, అందమన్నా ఆయన విపరీతంగా ఆరాధించేవాడు. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. అందరిలా చేస్తే తక్కువవుతానని ఏకంగా గుడి కట్టించాలని అనుకున్నాడు. అనుకెవడమే తడువుగా తన ఇంటినే ఆమెకు కోవెలగా మాలిచాడు. సమంత పుట్టిన రోజు (28 ఏప్రిల్)న గుడిని ప్రారంభిస్తామని చెప్తున్నాడు.
గతంలో ఆమె వయోసైటిస్ వ్యాధికి గురికాగా ఆమె త్వరగా కోలుకోవాలని చాలా దేవుళ్లకు పూజలు చేశాడు. అనేక దేవుళ్లకు ముడుపులు, మొక్కలు మొక్కుకున్నారు. ఇటీవల ఆమె వయోసైటిస్ నుంచి కోలుకొని ఎనర్జటిక్ గా ఉండడంతో సందీప్ మొక్కలు చెల్లించుకున్నాడు. కాలినడకన కొన్ని పుణ్య క్షేత్రాలను తిరిగి మొక్కు చెల్లించుకున్నాడు. తిరుపతి, చెన్నై, కడప దర్గా, నాగపట్నం తదితర క్షేత్రాల్లో కూడా మొక్కులు చెల్లించుకున్నారు.






