
NFBS scheme : కుటుంబాన్ని పోషించే యజమాని అకస్మాత్తుగా మరణిస్తే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్ఎఫ్ బీఎస్) కింద రూ. 20 వేలు అందిస్తోంది. కానీ ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. దీంతో దీనికి దరఖాస్తులు రావడం లేదని చెబుతున్నారు. 18-60 సంవత్సరాల మధ్య గల ఇంటి యజమాని చనిపోతే ఈ పథకం వర్తిస్తుంది. కానీ చాలా మంది దీన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇది వారికి తెలియడం లేదు.
ప్రమాదంలో కానీ అనారోగ్యంతో కానీ ఇతర కారణాలతో అయినా కుటుంబ యజమాని మరణిస్తే అతడి కుటుంబానికి రూ. 20 వేలు సాయం చేస్తుంది. ఇది 1995లో ప్రారంభించిన పథకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని రూ.10 వేలకు కుదించారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని మళ్లీ రూ. 20 వేలకు పెంచింది. దీంతో ఎవరైనా చనిపోతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
అమ్ ఆద్మీ బీమా, ఆపద్బంధు పథకాలకు మాత్రమే దరఖాస్తులు వస్తున్నాయని దీనికి రావడం లేదని పేర్కొంటున్నారు. ఇంటి యజమాని అయినా యజమానురాలు అయినా చనిపోతే ఈ పథకం కింద సాయం పొందవచ్చు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కింద ఈ మేరకు సాయం కోరే అర్హత ఉంటుంది. దీంతో ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆసరాగా నిలుస్తాయి.
పంచాయతీ సెక్రెటరీ, మున్సిపల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఈ పథకం గురించి ప్రచారం కొరవడింది. దీంతో చాలా మందికి తెలియక దీన్ని వినియోగించుకోవడం లేదు కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రాలు వాడుకోవడం లేదు. దీంతో దీని గురించి ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పథకాన్ని వినియోగించుకునేందుకు చొరవ తీసుకునేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.