
Rakesh Master’s Father : రాకేశ్ మాస్టర్ మరణించిన తర్వాత ఆయన గురించి తెక్కువగా తెలుసుకోవాలని కుతూహలం ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. ఆయన కుటుంబం, సినిమాలకు వచ్చిన నేపథ్యం, భార్య, పిల్లల గురించి ఎక్కువగా అన్వేషిస్తున్నారు. నిజంగానే ఆయన లైఫ్ మిస్టరీ, హిస్టరీనే. ఆయన ఎక్కడ పుట్టాడో సస్పెన్స్, కొందరు తిరుపతి కాదు కాదు నెల్లూర్ అని ఇంకొందరు అంటారు. ఇక ఆయన తండ్రి గురించి ఇప్పటి వరకు తెలుసుకునే అవసరం రాలేదు. ఆయన మొదటి భార్య, రెండో భార్య, మరో మహిళతో వివాహేతర సంబంధం ఇలా ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..
కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 చిత్రాలకు పని చేసిన రాకేశ్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు అంటున్నా రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, జిమ్మిపాడు ఆయన జన్మస్థలం అని రాకేశ్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. ఇక ఆయన తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన ఓ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత. అప్పటి కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరులో ఉన్న సమయంలో బాలిరెడ్డి ఆయనకు అనుచరుడిగా పని చేశారు. అయితే, కాస్ట్ ఫీలింగ్ ఉండద్దని సుందరయ్య చెప్తుండే వాడు. అందుకే బాలిరెడ్డిలోని రెడ్డి పదం తీసివేశారు. ఆయన గురువు ఆదేశాలతో ఆయన కూడా రెడ్డి తొలగించుకున్నారు. కొడుకుల పేర్లలోని రెడ్డి పదాన్ని కూడా తొలగించారట. అందుకే మన మాస్టర్ పేరు రామిరెడ్డి పోయి రామారావుగా మిగిలింది.
బాలిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. తిరుపతి మార్కె్ట్ యార్డ్ లో ఉద్యోగం రావడంతో కుటుంబం మొత్తం తిరుపతికి షిఫ్ట్ అయ్యారు. అక్కడే చాలా కాలం ఉన్నారు. తిరుపతికి వెళ్లిన సమయంలో అక్కడే డాన్స్ స్కూల్ పెట్టాడు రామారావు (రాకేశ్ మాస్టర్). ఎంతో కొంత గడించాక సినిమాల్లో చేయాలని సంకల్పంతో మద్రాస్ వెళ్లాడు. చాలా మంది వద్ద అసిస్టెంట్ గా పని చేశారు.
హీరో వేణు తొట్టెంపూడి సినిమా చిరునవ్వుతో సినిమాకు ఆయన సొంతంగా కొరియోగ్రాఫర్ చేశాడు. అప్పటి నుంచి ఆయన పేరు రాకేశ్ మాస్టర్ గా మార్చుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లాంటి వారికి ఆయన గురువు. మద్యానికి బానిసైన రాకేశ్ మాస్టర్ తాగిన మైకంలో ఇండస్ట్రీలోని పెద్దవారితో గొడవకు దిగేవాడు. అర్థం పర్థం లేని కామెంట్లు చేసి అవకాశాలు రాకుండా చేసుకున్నాడు. క్రమ క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
రాకేశ్ మాస్టర్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే.. ఆయనది లవ్ మ్యారేజ్. ఆయన వైఫ్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ లో చేస్తుంది. ఆమె పేరు ఆలేటి ఆటమ్. వీరికి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె, ఒక కుమారుడు. రాకేశ్ మాస్టర్ ప్రవర్తనతో భార్యకు దూరమయ్యారు. రెండో వివాహం కూడా చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో డేటింగ్ మొదలు పెట్టాడు.






