Yogi Adityanath : యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ కు ఎంతో పేరుంది. యూపీలో తనదైన రీతిలో పాలననందిస్తున్నారు. గత ప్రభుత్వాలు పెంచి పోషించిన రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. యోగి అధికారంలోకి వచ్చాక ఎంతో మంది రౌడీషీటర్లను ఎన్ కౌంటర్లు చేయించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలననందిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన భావి భారత ప్రధాని రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మోదీ తర్వాత అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి గా బీజేపీ ప్రచారం చేస్తున్నది. మరో వైపు ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం కూడా యోగికి ఉన్నట్లుగా తెలుస్తున్నది. నిరాండంబరమైన వ్యక్తిత్వమే యోగి ఆదిత్యనాథ్ కు కల్పిస్తున్నది. విపక్షాలు బుల్ డోజర్ సర్కారు అని విమర్శలు చేస్తున్న ఎక్కడా యోగి వెనక్కి తగ్గడం లేదు. అయితే ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.
యోగి ఆదిత్యనాథ్ కాషాయ వేషధారణలో కేవలం ‘సన్యాసి’ అని అంతా అనుకుంటారు. యోగి అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్, తన ఉద్యోగ విరమణ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గా మార్చుకున్నారు. ఆయన ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో 1972లో చాలా పేద కుటుంబంలో జన్మించారు. హెచ్ ఎన్ బీ గర్వాల్ యూనివర్సిటీలో చదివారు. యూనివర్సిటీ చరిత్రలోనే అత్యధిక మార్కుల సాధించారు. బీఎస్సీ మ్యాథ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. భారత సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు. ఆయన.మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుత నైపుణ్యం ఉంది. స్విమ్మింగ్లో ఎంతో నేర్పరి. పెద్ద నదులను దాటారు. కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిని మెచ్చుకున్నారు. రాత్రిపూట కేవలం నాలుగు గంటల పాటే యోగి నిద్రపోతారు. ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేచి, యోగా, ధ్యానంతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు. అది కూడా పూర్తిగా శాఖాహారం. ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు, దేశీయ ఆవు పాలు ఉంటాయి.యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు. యోగి కుటుంబం ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది. ఉద్యోగ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు. ఆయనకు ఒకే ఒక్క బ్యాంకు ఖాతా ఉంది. ఇక ఎలాంటి ఆస్తులు లేవు.తనకు వచ్చే వేతనాన్నే ఆహారం, బట్టల కోసం ఖర్చు చేస్తారు. మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.
అత్యంత నిరాడంబర వ్యక్తితం ఉన్న యోగి ఆదిత్యనాథ్ భావి భారత ప్రధానిగా ప్రస్తుతం రేసులో ఉన్నారు. బీజేపీ పదే పదే ఆయన పేరును తెరపైకి తెస్తున్నది. మోదీ తర్వాత అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తున్నది. మరోవైపు ఆర్ఎస్ఎస్ అండ కూడా యోగికే ఉన్నది. యూపీలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి హవా మరింత పెరిగింది. యోగి ఈ సారి గెలవలేడని పలు సర్వేలు వెల్లడించినా, ఆయన అత్యంత మెజార్టీతో గెలిచి సీఎం పీఠమెక్కారు. మరోవైపు తన వ్యక్తిత్వమే ఆయనకు ప్రధాన బలం. ఇక రానున్న రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ ను కూడా ప్రధాని గా చూడబోతున్నామన్న మాట.
|
ReplyForward
|






