34.7 C
India
Friday, April 10, 2026
More

    చెదపురుగులను తరిమికొట్టే చిట్కాలేంటో తెలుసా?

    Date:

    termites
    termites

    వేసవి కాలంలో చెదపురుగులు, చీమలు వేధిస్తాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వాటి దర్శనం మనకు ఇబ్బందులకు గురిచేస్తుంది. చీమల ధార అయితే అది ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుత్నాయో తెలియదు. కానీ వరుసలో వెళ్తుంటాయి. వాటి క్రమశిక్షణ చూస్తే ముచ్చటేస్తుంది. కానీ కోపం వస్తుంది. ఇదెక్కడి తంటరా బాబూ అని తల పట్టుకుంటాం. కానీ వాటిని చిటికెలో తరిమే చిట్కాలు ఉన్నాయి తెలుసా?

    చెద పరుగులు, చీమలకు చెక్ పెట్టడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. నిమ్మ, నారింజ వంటి పండ్ల రసంతో వెనిగర్ కలిపి అవి ఉన్న చోట స్ర్పే చేస్తే అవి లేకుండా పోతాయి. వాటి వాసన అంటే అవిటికి పడదు. అందుకే ఇక కనిపించకుండా పోవడం గ్యారంటీ. ఇంత సులభమైన చిట్కా చాలా మందికి తెలియదు. అందుకే వాటిని వెళ్లగొట్టేందుకు ముందుకు రారు.

    వీటిని తరిమికొట్టే మరో చిట్కా వెల్లుల్లి. వెల్లుల్లి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని తెలుసు. కానీ చెదపురుగులు లేకుండా పోవాలంటే వెల్లుల్లిని ముద్దలా నూరి దాన్ని నీళ్లలో కలిపి అవి ఉన్న చోట జల్లితే అవి పరారవుతాయి. వెల్లుల్లి వాసన వాటికి పడదు. ఇంకా దాల్చిన చెక్క కూడా వాటిని దూరం చేస్తుంది. దాని వాసనతో కూడా అవి వెళ్లిపోతాయి.

    ఇలాంటి సులభమైన చిట్కాలతో చెదపురుగులు, చీమలు రాకుండా చూసుకోవాలి. అవి వచ్చాయంటే ఇక వాటితో వేగడం కష్టమే. ధారలో కనిపిస్తాయి. దీంతో మనకు ఏమి తోచదు. అందుకే ఈ చిట్కాలు ఉపయోగించి చీమలు, చెదపురుగులను దూరం చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. మన వంటింట్లో లభించే మందులతో మనకే కాదు మన వ్యతిరేక జీవులకు కూడ మంచి మందులా పనిచేయడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related