Gautham Income :
చేసిన ఫస్ట్ సినిమాతోనే స్టార్ కమెడియన్ ముద్ర వేయించుకున్నాడు బ్రహ్మానందం. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా కూడా ప్రేక్షకులు ఆయనను అభినందించారు. ఇక కామెడీ టచ్ ఉన్న విలన్ గా బ్రహ్మానందం సూట్ అయినంత మరెవరూ సూట్ కారంటే అతిశయోక్తి లేదు. ఫస్ట్ మూవీతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నా.. తక్కువ సమయంలోనే లెజండరీ కమెడియన్ గా ముద్ర వేయించుకున్నాడు. తెలుగు సినీ చరిత్రలో ఇంత సుధీర్ఘ కాలం స్టార్ కమెడియన్ గా కొనసాగిన వారు లేరని ఘంటా పథంగా చెప్పవచ్చు.
బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు కాగా పెద్దవాడు రాజా గౌతమ్. తండ్రి బాటలో వెళ్లాలని అనుకున్నాడు. 2004లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దిగ్గజ దర్శకుడు కే రాఘవేందర్ రావు గౌతమ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో కీరవాణి అందించిన బాణీలు ఇప్పటికీ పెళ్లి మండపాల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన ఆయనకు ఆడియన్స్ పాస్ మార్కులే వేశారు. తర్వాత కొన్ని సినిమాలు తీసినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయినా స్టార్ డమ్ మాత్రం రాలేదు. యాక్టింగ్ ను ఆయన ఫ్యాషన్ గా మాత్రమే తీసుకుంటారట. ఆయనకు బిజినెస్ అంటే చాలా ఇష్టమని అందులోనే బాగా రాణిస్తున్నారట.
ఆయనకు కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయట. ఐటీతో పాటు బహుళ జాతి కంపెనీలైన ఎంఎన్‌సీల్లో పెట్టుబడులు కూడా పెట్టాడట. బెంగళూర్ లో రెస్టారెంట్లు ఉన్నాయట. వీటితో పాటు మరిన్ని వ్యాపారాల ద్వారా రాజా గౌతమ్ నెలకు రూ. 30 కోట్లకు పైమాటే సంపాదిస్తున్నారట. రోజుకు రూ. కోటి అన్నమాట. అయితే సినిమాకు వంద కోట్లు తీసుకునే పాన్ ఇండియా లాంటి హీరోలతో పోల్చుకుంటే ఇది బెటర్ అంటున్నారు కొందరు. సినిమాకు రెండు మూడేళ్లు కష్టపడాలి. కానీ రాజా గౌతమ్ బిజినెస్ చేయకున్నా కూడా డబ్బులు కుప్పలుగా వస్తుంది.
దీనిని బట్టి చూస్తే రాజా గౌతమ్ స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ సంపాదిస్తారని తెలుస్తుంది.
‘అహ నా పెళ్ళంట’ సినిమాతో తెరంగేట్రం చేసిన బ్రహ్మానందం దశాబ్దాల పాటు తీరిక లేకుండా నవ్వులు పూయించారు. వీటితో ఆయన కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. బ్రహ్మానందం రూపాయి కూడా దానం చేయరూ.. ఎవరికీ ఇవ్వరు. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు ఆయన. తన డబ్బును కొడుకు పెట్టుబడిగా వాడుకొని మరికొంత గడించాడు. ప్రస్తుతం ఆయన తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన ‘రంగ మార్తాండ’ భారీ విజయాన్ని దక్కించుకుంది.