
increase sexual interest ఫ మనలో చాలా మంది లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. యువ జంటలు కూడా లైంగికంగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సంసారంలో కలతలు వస్తున్నాయి. లైంగిక సమస్యలకు ఆహారాలతో కూడా చెక్ పెట్టొచ్చు. ఈనేపథ్యంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. లైంగిక సామర్థ్యం పెంచుకోకపోతే తిప్పలు తప్పవు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు ఏంటో చూద్దాం.
లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాల్లో బీన్స్ ఒకటి. వీటిలో ఉండే పోషకాలు మనకు లైంగిక ఆసక్తి పెంచుతాయి. కండరాలకు బలం చేకూర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కాఫీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ మకు ఎంతో శక్తినిస్తుంది. దీని వల్ల కూడా మనకు లైంగిక ఆసక్తి కలుగుతుంది. దీన్ని తాగడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. చురుకుదనం వస్తుంది.
ఆకుకూరల్లో మంచి పోషకాలు ఉంటాయి. శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో ఉండే గ్లూకోజ్ ను మెరుగుపరుస్తుంది. దీంతో వీటిని తీసుకుని మన లైంగిక శక్తిని పెంచుకోవచ్చు. మాంసం, చేపలు, చికెన్ కూడా మనకు శక్తి అందించడంలో తోడ్పడతాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. రోజంతా చురుకుగా ఉండేందుకు సాయపడుతుంది.
నల్ల ద్రాక్ష కూడా మన శక్తిని పెంచుతాయి. ఇందులో తక్కువ చక్కెర ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మంచి ఆహారమే. దీంతో లైంగిక ఆసక్తి ఇనుమడిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. శరీరం తొందరగా అలసిపోకుండా చేస్తుంది. ఇలా మనం ఈ ఆహారాలు తీసుకుని లైంగిక సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.