Blue Hole Formation :
మనం ఇప్పటికి ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఇంకా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశంలో జరిగే వింతలు, విశేషాలు తెలుసుకుంటున్నా ఇంకా కొన్నింటిపై సందిగ్ధం నెలకొంది. ప్రకృతి వైపరీత్యాల గురించి ఇంకా మనకు అంతు చిక్కడం లేదు. అవి ఎప్పుడు వస్తాయో? ఎలాంటి ఉత్పాతాలు సృష్టిస్తాయో అర్థం కావడం లేదు. దీంతో ప్రకృతి ఒడిలో జరిగే కొన్నింటిని మనం చూస్తూ ఉండాలే కానీ అవి ఎందుకు వస్తున్నాయో తెలియదు.
ప్రపంచమే ఒక వింత. దీని మీద మనకు చాలా విషయాలు తెలియనివి జరుగుతూనే ఉంటున్నాయి. ఇందులో భాగంగా బ్లూ హోల్ గురించి ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఈ బ్లూ హోల్ ఎక్కడ ఉంది. ఎందుకు ఏర్పడుతుంది. ఇందులోని శాస్త్రీయత ఏంటనే దానిపై ఇంతవరకు ఎలాంటి పరిష్కారం కనుగొనలేదు.
బ్లూ హోల్ అంటే సముద్రం మధ్యలో ఏర్పడే ఒక పెద్ద నీటి గుంత. ఇది మెక్సికో చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీపకల్పంలో దీన్ని కనుగొన్నారు. ఇది సుమారుగా 900 అడుగుల లోతు 1.47 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు లైవ్ సైన్స్ నివేదిక గుర్తించింది. ప్రపంచంలో ఇది రెండో అతిపెద్ద బ్లూ హోల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇందులోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని అభిప్రాయాలు వస్తున్నాయి. బ్లూహోల్ లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే బ్లూ హోల్ తో జీవం ఎలా మొదలైందో తెలుసుకోవాలని చూస్తున్నారు. బ్లూ హోల్ ఎలా ఏర్పడుతుందనేది అంతు చిక్కడం లేదు. బ్లూహోల్ గురించి అందరికి ఆద్యంతం ఆసక్తి పెరుగుతోంది.