30.9 C
India
Saturday, May 17, 2025
More

    Alcohol : కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

    Date:

    Alcohol
    Alcohol

    alcohol : కల్తీ మద్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కల్తీమద్యం విచ్చల విడిగా తయారు చేస్తున్నారు. దీని బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గతంలో బిహార్‌లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మద్య నిషేధం ఉంది కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్క బిహార్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దందా జోరుగా సాగుతోంది. తాజాగా తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 63మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

    అయితే అసలు కల్తీ మద్యం ఎలా తయారుచేస్తారు. ఇది విషంగా ఎలా మారుతుంది. దీనిని తాగిన వ్యక్తి ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకుందాం. కల్తీ మద్యం ఎలా తయారచేస్తారో తెలిస్తే  షాక్ అవుతారు. దీనినే దేశీ మద్యం కూడా అంటారు. చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్‌పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్ళిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ మొదలైన వాటిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడుతారు. తర్వాత దీనికి ఆక్సిటాక్సిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా లాంటివి కలుపుతారు.

    ఇవన్నీ నపుంసకత్వానికి దారి తీస్తాయి. అంతేకాకుండా నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. వీటిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత బట్టీ సాయంతో ఆవిరి నుంచి మద్యం తీస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కలుపుతారు. అయితే ఇలా తయారుచేసిన మద్యం మరింత మత్తుగా మార్చేందుకు నిర్వాహకులు రకరకాల రసాయనాలను వాటికి కలుపుతారు.

    ఈ క్రమంలో అది విషంగా మారుతుంది. యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ (ఇథైల్ ఆల్కహాల్)కు బదులుగా మిథైల్ ఆల్కహాల్‌గా మారుతుంది.  ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాల్ కారణం. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి దాని ఆల్కైల్ సమూహంలోని ఆల్డిహైడ్‌గా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా రూపాంతరం చెందుతుంది.

    ఇది నేరుగా తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇలా తయారు చేసిన ఆల్కహాల్ మానవ శరీరానికి ప్రాణాంతకంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం ఆపేస్తాయి. కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. దీని కారణంగా చాలా సందర్భాలలో అకాల మరణాలు సంభవిస్తాయి.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good news : మందుబాబులకు గుడ్ న్యూస్!

    Good news : కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లు...

    Alcohol : అక్కడ మద్యం డోర్ డెలివరీ అంట.. సంబురాల్లో మందుబాబులు..

    alcohol door Delivery : మద్యం షాపుకు వెళ్లాలి.. ఇప్పుడు మందు...

    Liquor : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. రూ.99కే మద్యం

    Liquor rate in AP: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో...

    drunkards : ఆ రాష్ట్రంలో మందు గ్లాస్ ఎత్తితే దించరట.. ఎక్కువ మంది తాగుబోతులు ఉన్న రాష్ట్రాలు ఇవే..

    Drunkards : దేశంలో గుజరాత్, బిహార్, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు...