Raha Kapoor Cute Video : బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్-అలియా భట్ ల కూతురు రాహా ప్రస్తుతం అభిమా తారల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రాహాను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ఆమె ప్రతి వీడియో ఇంటర్నెట్‌లో రాగానే వైరల్ గా మారుతున్నది. రాహా కొత్త వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఆమె క్యూట్‌నెస్ చూసిన నెటిజన్స్ ఎంత ముద్దుగా ఉందో అంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలో తల్లిదండ్రులు రణబీర్-అలియాలతో రాహా కనిపించింది. ఈ సమయంలో, రాహా తన నానమ్మను క్యూట్ రియాక్షన్ ఇవ్వగా అది ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
నానమ్మను చూడగానే చప్పట్లు..
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తమ కూతురు రాహాతో ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ సమయంలో, ఫొటోగ్రాఫర్లు రాహాను తమ కెమెరాలో బంధించారు. తమ కెమెరాల్లో చాలా అందమైన క్షణాన్ని బంధించే అవకాశం ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు లభించింది. నీతూ కపూర్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే, ఆమెను చూసిన రాహా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నానమ్మ నీతూని చూడగానే రాహా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ క్యూట్ మూమెంట్ సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను హత్తకుంటున్నది. రాహా స్టైల్ తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది.
ఈ వీడియోపై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. రాహా కపూర్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాహా వైట్ కలర్ ఫ్రాక్ లో చాలా క్యూట్‌గా ఉన్నది. అభిమానులు రాహా క్యూట్‌నెస్‌ను కొనియాడుతున్నారు. ‘రిషి కపూర్‌కి పునర్జన్మ’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశఆడు. మరికొందరు రాహకు దిష్టితగిలేలా ఉందంటూ కామెంట్లు పెట్టారు.
View this post on Instagram