మధుమేహంతో చాలా సమస్యలు వస్తాయి. దీంతో ఎన్నో రకాల జబ్బులు వేధిస్తాయి. అన్ని అవయవాలు దెబ్బతింటాయి. డయాబెటిస్ ఉందంటే చెట్టుకు చెద పట్టినట్లే. మెల్లమెల్లగా అవయవాలు దెబ్బతినేలా చేస్తుంది. షుగర్ నియంత్రణలో ఉండకపోతే మన శరీరం గుల్ల చేస్తోంది. దీని వల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది.
మధుమేహం ఉన్న వారు తమ శరీరాన్ని కాపాడుకోవాలి. పాదాలకు పుండ్లు పడితే జాగ్రత్తగా గమనించాలి. పాదాలకు పుండ్లు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే పాదం తీసేయాల్సి రావచ్చు. మధుమేహం అంటే అంతటి ప్రమాదకరమైన జబ్బు కావడంతో నిరంతరం అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు రావచ్చు.
షుగర్ ఉంటే నాడులు దెబ్బ తింటాయి. దీని వల్ల పక్షవాతం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకా గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మధుమేహం అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీని వల్ల కూడా అనేక ఉపద్రవాలు చోటుచేసుకుంటాయి.
మధుమేహం ఉంటే పాదాల పుండ్లు మానవు. రక్త సరఫరా మెరుగుగా ఉండకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తాయి. రక్తనాళాల సమస్యలు ఏర్పడితే రక్తప్రసరణ సరిగా సాగదు. దీని వల్ల పాదాలకు ముప్పు ఏర్పడుతుంది. ప్రతి రోజు పాదాలను గమనించుకోవాలి. రోజు పాదాలను పరిశుభ్రంగా కడుక్కోవాలి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
గోళ్లు తీసుకునేటప్పుడు వేళ్లు తెగకుండా చూసుకోవాలి. పాదాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. లేదంటే పాదాల రక్షణ మన బాధ్యత. ఈ నేపథ్యంలో పాదాలను రక్షించడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందే. పాదాల పుండ్లు పడకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీనికి షుగర్ పేషెంట్లు తగు విధంగా ప్రవర్తించాలి.






