Animal : తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, బాబీ డియోల్, త్రీప్తి డిమ్రీ, రష్మిక మందన్నా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా రూ. 900 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ ను ఆశ్చర్య పరిచింది. ఇక ఇందులో రణబీర్, బాబీడియోల్ పోటాపోటీగా నటించారు. బాబీ డియోల్ విలన్ గా చెలరేగిపోయాడు. ఈ ఒక్క సినిమా అటు బాబీ డియోల్, ఇటు రణబీర్ కపూర్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఇక బాబీ డియోల్ కోసం అటు నార్త్ తో పాటు ఇటు దక్షిణాది దర్శకులు, నిర్మాతలు డేట్ల కోసం వెంట పడుతున్నారు.
ఒకవేళ సందీప్ రెడ్డి యానిమల్ సినిమాను తెలుగులో తీస్తే సినిమా ఎలా ఉండేది. తెలుుగలో ఏ హీరోతో చేసేవాడు అని కొందరు తమ ఊహిస్తున్నారు. ఒక వేళ తెలుగులో రణబీర్ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ కపూర్ స్థానంలో కృష్ణ కాంబినేషన్ లో సినిమా చేస్తే ఎలా ఉండేదని కొందరు భావించారు.
దీంతో ఇప్పుడున్న ఏఐ టూల్స్ ను ఉపయోగించి యానిమల్ చిత్రంలోని కొన్ని సీన్లు రీ క్రియేట్ చేశారు. ఇందులో మహేష్ బాబు, కృష్ణ ల ఫేస్ స్వాప్ ద్వారా రణబీర్, అనిల్ కపూర్ పాత్రలను రీక్రియేట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతున్నది. ఈ క్లిప్ చూసి అభిమానులు సూపర్ క్రియేషన్ అంటూ అభినందిస్తున్నారు. రెండు సీన్లలో మహేష్ బాబు, కృష్ణ పర్ఫెక్ట్ గా కుదిరారు. తెలుగులో తీస్తే యానిమల్ కన్నా పెద్ద హిట్టయ్యేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram