Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. గత చిత్రాలు నిరాశపరచడంతో జైలర్ బ్రహ్మాండమైన హిట్ సాధించింది. కలెక్షన్లు కొల్లగొడుతోంది. ప్రేక్షకుల అంచనాలు చేరుకుంటోంది. బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తలైవా నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో సినిమా దూసుకుపోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 152 కోట్లు సాధించింది. నేటితో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక యూఎస్ఏ బాక్సాఫీసులో జైలర్ 3 మిలియన్ మార్కును దాటేసింది. రజనీకాంత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డులు తిరగరాస్తోంది. జైలర్ సినిమా హాలీవుడ్ కాపీ అని కామెంట్లు వచ్చినా కథలో బలం ఉండటంతో మంచి ఊపులో వెళ్తోంది.
రజనీకాంత్ కు జంటగా తమన్నా నటించింది. సినిమాలో మన తెలుగు వారు సునీల్ కూడా నటించాడు. ఇలా సినిమా బ్రహ్మాండమైన హిట్ గా చెబుతున్నారు. సినిమాకు మంచి ఊపు తీసుకొచ్చిన ఘనత సంగీత దర్శకుడు అనిరుద్ కూడా తనదైన పాత్ర పోషించాడు. జైలర్ మూవీ చూసిన వారందరు ఎంతో ఉత్సాహానికి గురవుతున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికి తెలుసు. ఆయన సినిమా విజయంలో రజనీకాంత్ స్టైల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జైలర్ ఆశించిన మేర విజయం అందుకోవడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలైవాకు మరో బంపర్ హిట్ దక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో జైలర్ మరింత ఎక్కువ సంఖ్యలో కలెక్షన్లు సాధిస్తుందని చెబుతున్నారు.