Mahesh Babu Daughter Sitara : డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు. యాక్టర్ కొడుకు యాక్టరే అవుతాడని చాలా సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ప్రస్తుతం యాడ్లలో నటిస్తూ తండ్రి కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటోంది. దీంతో తండ్రికి తగ్గ తనయగా కీర్తించబడుతోంది. చిన్న నాడే కనిపించు సిరిగల్ల గుణం అన్నట్లు చిన్ననాటి నుంచే ఆమె అన్ని అర్హతలు సాధిస్తోంది.
నృత్యం, గానం, నటన తదితర విషయాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తండ్రి గొప్ప నటుడు కావడంతో తాను కూడా తగ్గేదేలే అంటోంది. పదేళ్ల ప్రాయంలోనే రూ. కోటి సంపాదిస్తోందంటే ఇక పెద్దయ్యాక తండ్రిని మించిపోతోందని అంటున్నారు. సితారకు ఇన్ స్టా గ్రామ్ లో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆరేళ్ల వయసులోనే యూ ట్యూబ్ చానల్ పెట్టి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఎన్నో అద్భుతాలు చేసింది.
సితార యానీ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. డాన్స్, పాటలు పాడుతూ అభిమానులను సంపాదించుకుంటోంది. ఇండియాలోనే మొట్టమొదటి స్టార్ కిడ్ గా రికార్డు సాధించింది. న్యూయార్క్ లోని టైం స్క్వీర్ స్ట్రీట్ లో తన హోర్డింగ్ లు వెలువడటం సంచలనం కలిగించింది. దీంతో తండ్రి మహేష్ బాబు ఉప్పొంగిపోతున్నాడు. కూతురు ఎదుగుదలకు ఫిదా అవుతున్నాడు.
అంతర్జాతీయ జువెల్లరీ సంస్థకు యాడ్ చేశారు. దీనికి ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆ యాడ్ కోసం ఆమె ఏకంగా రూ. కోటి తీసుకుందట. ఇప్పుడే ఇంత తీసుకుంటుంటే భవిష్యత్ లో ఇంకా ఎంత తీసుకుంటుందో తెలియడం లేదు. ఇలా తన వారసురాలు పైకా వెళ్లడం చూస్తుంటే మహేష్ బాబుకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.
ReplyForward
|