Bigg Boss 7 Shakeela Remuneration :
బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి రెండవ వారం కూడా ముగిసింది.. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్కులను ఇస్తున్నాడు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రెండవ వారం ఎలిమినేషన్స్ కూడా ముగిసాయి.. రెండవ వారంలో 9 మంది నామినేట్ అయ్యారు.
పల్లవి ప్రశాంత్, తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ లు నామినేట్ అవ్వగా షకీలాను బయటకు పంపించారు.. నిన్న వీకెండ్ కావడంతో ఈమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినప్పుడు నాగ్ తో ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదని చెప్పి ఎమోషనల్ అయ్యింది..
ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది అనగానే బోల్డ్ బ్యూటీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈమె హౌస్ లోకి వచ్చాక అంత పసలేకపోవడంతో చిన్నగా రెండవ వారంలోనే ఈమెను బయటకు పంపించారు. అందరితో బాగా కలిసి పోయిన ఆడియెన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఈమెకు ఓటింగ్ రాలేదని చెప్పాలి..
ఎప్పుడు స్మోకింగ్ జోన్ లోనే డిస్కర్షన్స్ పెడుతూ ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేక పోయింది. ఇక ఈమె హౌస్ లో ఉన్న రెండు వారాలు ఎంత రెమ్యునరేషన్ అందుకుంది అనే విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈమెకు వారానికి 3.5 లక్షలు ఫిక్స్ చేసారని టాక్.. ఈ లెక్కన 7 లక్షల నుండి 8 లక్షల వరకు షకీలా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.
ReplyForward
|