Sitara Ad Remuneration :
టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఒకరు. ఈ జంట గారాలపట్టి సితార గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అంతేకాదు సితార ఎప్పటి నుండి సోషల్ అకౌంట్ కలిగి ఉంది. ఈమెకు కూడా భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాలను పంచుకుంటూ ఉంటుంది..
ఎప్పుడు సితార సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో, ఫొటోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఇక తాజాగా అయితే ఘట్టమనేని ప్రిన్సెస్ అమెరికా లోని టైమ్స్ స్క్వేర్ పై ఎక్కి చిన్న వయసులోనే అరుదైన గౌరవాన్ని సాధించింది. ఈ విషయంలో మహేష్ బాబు, నమ్రత చాలా సంతోషంగా ఉన్నారు. కూతురు మరిన్ని సాధించాలని తెలిపారు.
సితార సైతం ఈ విషయంలో ఎమోషనల్ అయ్యింది. ఇక జ్యువెలరీ యాడ్ కోసం సితార తీసుకున్న పారితోషికం గురించి నెట్టింట జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. అంత చిన్న వయసులోనే యాడ్ లో నటించడం ఒక ఎత్తు అయితే ఆ యాడ్ కోసం ఏకంగా హీరోయిన్ లను మించిన పారితోషికం తీసుకోవడం మరో ఎత్తు అని తెలుస్తుంది.
మహేష్ ముద్దుల కూతురు సితార జ్యూవెలరీ యాడ్ కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుందట.. దీంతో ఈ క్యూటీ ఇప్పుడు మరో సంచలనం సృష్టించి ఆశ్చర్య పరుస్తుంది.. ఇదిలా ఉండగా సితారకు ఇప్పటికే చాలా యాడ్స్ వచ్చాయని కానీ మహేష్ నో చెబుతూ వస్తున్నాడు అని సమాచారం.. అయితే అమెరికా టైమ్స్ స్క్వేర్ లో సితారను చూసిన తర్వాత మహేష్ ఆనందం అంతా ఇంత కాదట. ఈయన ఒప్పుకోవడానికి ఇది రీజన్ అని తెలుస్తుంది.