Tomato మనకు లాటరీ తగిలితే రూ. కోట్లు వస్తాయి. కానీ అతడికి టమాటాల లాటరీ తగిలింది. టమాటాలు పండించి రూ. కోట్లు గడించాడు. దేశవ్యాప్తంగా టమాటల ధరలు అమాంతం పెరగడంతో అతడి అదృష్టం మలుపు తిరిగింి. పూణేలోని ఓ రైతు టమాట పంటతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. తాను పండించిన పంటకు ధర విపరీతంగా పెరగడంతో డబ్బు వచ్చి చేరింది.
సచ్మర్ కు చెందిన బాగోజ్ గయ్యర్ కుటుంబం తనకున్న 18 ఎకరాల భూమిలో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. దీంతో దాదాపు వంద మంది మహిళలతో టమాటాలు తెంపడం, డబ్బాల్లో నింపడం, మందులు పిచికారీ చేయడం వంటి పనులు చేయిస్తున్నాడు. టమాటాకు ఒక్కసారిగా ధర పెరగడంతో అతడికి కాసుల పంట పండింది. ఇతడికి ఒక్క రోజులోనే రూ.18 లక్షల ఆదాయం సమకూరింది.
ఇతడి ఆదాయం నెల రోజుల్లో రూ.80 కోట్లు దాటింది. దీంతో టమాటా పండించి అతడు కోటీశ్వరుడయ్యాడు. టమాటా ధరకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అతడికి ఆదాయం వచ్చి చేరింది. ఇంకా వస్తూనే ఉంది. పంట పూర్తయ్యే సరికి అతడికి ఏకంగా రూ. వంద కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. టమాటా లాటరీ అంటే ఇదేనేమో.
ఇంకా ధర బాగానే ఉండటంతో ఆ రైతు సంపాదన చివరకు ఎంతకు చేరుతుందో తెలియడం లేదు. దీంతో టమాటా తోటల దగ్గర కాపలా మనుషులను కూడా పెడుతున్నారు. టమాట దుకాణాల వల్ల రాత్రి సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటున్నారు. అంటే టమాటాల ధర బంగారంలా పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా రైతులకు సిరులు కురిపిస్తోంది.