29.3 C
India
Tuesday, February 10, 2026
More

    cumin : జీలకర్రతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

    Date:

    cumin
    cumin

    cumin : మన ఆరోగ్యానికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. జీలకర్రను ఆయుర్వేదంలో ప్రాధాన్యం ఇస్తుంటారు. అనేక మందుల్లో దీన్ని వాడుతుంటారు. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేందుకు జీలకర్రను వినియోగించుకుంటాం. మన వంటింట్లో ఉంటే దినుసుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని కూరల్లో వేసుకుంటే వాటిని భలే రుచి వస్తుంది. అందుకేు దీన్ని మన ఆరోగ్యం కోసం తరచుగా వాడుకోవడం మంచిదే.

    జీలకర్ర జీర్ణ సంబంధమైన వ్యాధులను దూరం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే థైమో క్వినోస్ అనే రసాయన సమ్మేళనం కాలేయానికి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. కొవ్వును కరిగించుకోవడానికి జీలకర్రతో అద్భుతమైన చిట్కా ఉంది. దీన్ని ఉపయోగించుకుని కొవ్వు, షుగర్ ను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    జీలకర్ర రెండు గ్రాముల మోతాదులో 8 వారాల పాటు తీసుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. అధిక బరువుకు కూడా చెక్ పెట్టొచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరోధిస్తుంది.

    జీలకర్రను నీటిలో మూడు నాలుగు గంటలు నానబెట్టి ఉంచాలి. తరువాత మరిగించి వడకట్టాలి. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. జీలకర్ర నీటిని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా జీలకర్ర నీటిని తాగడం వల్ల డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related