Ramcharn UPasana : వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. వెంట్రుకలు లేకపోతేనే ఇబ్బంది. వెంట్రుకలు ఉంటే ఎన్ని జడలైనా వేయొచ్చు. ఎంత అందంగానైనా తీర్చిదిద్దొచ్చు. ఇప్పుడు రాంచరణ్, ఉపాసన దంపతుల కూతురు కోసం రాంచరణ్ ఏకంగా రూ. కోటిన్నర ఖర్చు చేశాట్ట. ఆస్పత్రి వారిదే అయినా అంతలా ఎందుకు ఖర్చయింది అంటే ఖరీదైన వైద్యం చేయించారట. ప్రపంచంలోనే ఉత్తమ గైనకాలజిస్ట్ ను రప్పించారట.
ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఉపాసనకే కేటాయించారట. కొన్ని ఎక్విప్ మెంట్లు విదేశాల నుంచి తెప్పించారట. డబ్బుంటే ఏదైనా సాధ్యమే. ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. వారు పెట్టిన ఖర్చు ఒక మధ్యతరగతి కుటుంబం జీవితమంతా గడిపేయొచ్చు. అంతటి ఖర్చు పెట్టి తమ కూతురుకు జన్మనిచ్చారు ఖర్చంతా రాంచరణే పెట్టుకున్నాట్ట. ఇలా రాంచరణ్ తన కూతురు కోసం అంత భారీ మొత్తం ఖర్చు చేయడం విశేషం.
జూన్ 20న రాంచరణ్, ఉపాసనల జంటకు కూతురు జన్మించింది. దీంతో మెగా ఇంట సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన జూన్ 22న ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జి అయింది. తమ బిడ్డ కోసం రాంచరణ్ అంత మొత్తం ఖర్చు చేయడంలో ఇప్పుడు అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎవరైనా పేదవారికి దానం చేయమంటే చేస్తారా? చేయరు. కానీ ఇలాంటి ఖర్చులు మాత్రం పెడతారు.
రాంచరణ్ భార్య డెలివరీకి పెట్టిన ఖర్చుతో ఏకంగా ఓ బంగ్లానే కొనుక్కోవచ్చు. ఇలా గొప్పలకు పోయి ఖర్చు చేయడమంటే వారికి ఉన్నాయనే ఉద్దేశంతోనే కదా. కానీ లేని వాని పరిస్థితి ఏంటి. కూతురు కోసం కోట్లు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. ఈ నేపథ్యంలో రాంచరణ్, ఉపాసన దంపతులు మునుముందు ఇంకా ఏ ఖర్చులు పెడతారో తెలియడం లేదు.
ReplyForward
|