Bluetooth Earrings : అమ్మాయిలపై వేధింపులు, అరాచకాలు అరికట్టే అందుకు గోరఖ్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థు లు విరుద్ధంగా ఆలోచించారు. టెక్నాలజీ వినియో గించి బ్లూటూత్ జుంకాలను అని పెట్టారు.
35 గ్రాముల బరువు ఉన్న వీటిలో రెండు అలారం స్విచ్లు, మూడు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఫీడ్ చేశారు. మహిళలను ఆకతాయి ఇబ్బంది పెడితే వెంటనే స్విచ్ నొక్కితే ఈ జుంకాల నుంచి ఎమర్జెన్సీ కాల్స్ వెళ్లడంతో పాటు మహిళలు ఉన్న లొకేషన్ కూడా పోలీసులకు చేరిపోతుంది.
పోలీసులు లొకేషన్ కు వచ్చే లోపు వారి నుంచి రక్షించేందుకు ఈ జుంకాల నుంచి మిరియాలు, మిర్చి పొడిని ఆకతాయిల పై చల్లుతాయి. ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల ఆకతాయిలో తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ జుంకాలు గనుక మార్కేట్ లోకి వస్తే మహిళలకు మేలు జరుగుతుంది.