26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Shaheen Khan : చిరునవ్వుతో హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

    Date:

     

     

    Shaheen Khan
    Shaheen Khan

    Shaheen Khan : దాదాపు 23 సంవత్సరాల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘చిరునవ్వుతో’. ఈ సినిమా అప్పట్లో పెద్ద ప్రభంజనమనే చెప్పాలి. వేణు కెరీర్ లో ది బెస్ట్ మూవీలో నెంబర్ 1 ప్లేస్ లో ఈ సినిమా చేరుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా ఆమెనే షహీన్ ఖాన్. ఈ సినిమా వేణుకు ఎంత గుర్తింపు తెచ్చి పెట్టిందో షహీన్ ఖాన్ కు కూడా అంతే గుర్తింపు తెచ్చిపెట్టింది.

    షహీన్ ఖాన్ అందం ముందు కోతులే చిత్తయి పోతుంటే ఇక మన మెంత చెప్పండి.. ఈ సినిమాతో ఆమె కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆమె పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథను అందించారు. అందుకే ప్రతీ డైలాగ్ కట్టిపడేస్తుంది. ఈ మూవీతోనే కమెడియన్ సునీల్ వెండితెరపై అడుగుపెట్టగా.. ‘నువ్వే కావాలి’ మాత్రం ముందే రిలీజ్ అయ్యింది. స్వయంవరంతో పాటు ఈ సినిమా కూడా తొట్టెంపూడికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అయితే ఈ మధ్య చనిపోయిన రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది కావడం విశేషం.

    ‘చిరునవ్వుతో’ తర్వాత ‘మనసుపడ్డాను కానీ’ సినిమాలో నటించాడు వేణు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.  అయితే చిరునవ్వుతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ ఈ సినిమాతో డైరెక్టర్ రామ్ ప్రసాద్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీలో రిమేక్ అయిన ఈ సినిమా నాలుగు నందులను గెలుచుకుంది.

    ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షహీన్ ఖాన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ సుందరి అప్పట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించి నిర్మాతల కన్నుల్లో పడింది. తర్వాత శంకర్ మహదేవన్ చేసిన ప్రైవేట్ ఆల్బన్ లో నటించింది. తెలుగులో ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమా తర్వాత బ్రేక్ ఇచ్చింది. వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. సినిమాలో కంటే ఇప్పుడే చాలా అందంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తన పిక్ లను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను కాపాడుకుంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PAK vs BAN : షహీన్‌ను పక్కనపెట్టడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాక్ క్రికెటర్  

    PAK vs BAN : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పరాజయం...