Prajapalana Applications Status : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తోంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ప్రతి వారికి ఓ నంబర్ ఇచ్చి వారి అప్లికేషన్ లో ఉన్న వారి కోరికలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆరు పథకాల అమలు తమ బాధ్యతగా చూస్తున్నారు. అందుకే అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకుంది.
ఆరు హామీల అమలు కోసం ఓ కమిటీ కూడా వేసింది. దీనికి చైర్మన్ గా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తారు. 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ, గ్రహ జ్యోతి వంటి పథకాలున్నాయి. వీటి అమలుకు దరఖాస్తులతో సిద్ధమవుతోంది.
ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం 1.11 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అభయహస్తం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 అప్లికేషన్లు లభించాయి. జనవరి 17 వరకు దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. డేటా ఎంట్రీ పూర్తి చేసిన తరువాత కంప్యూటరీకరణ చేయడంలో నిమగ్నమయ్యారు.
ప్రజాపాలన దరఖాస్తులను వెబ్ సైట్ లో విండో ఓపెన్ చేసుకుని తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి గాను అప్లికేషన్ నెంబర్ ఎంట్రీచేసి దాని కింద క్యాప్షన్ ఎంటర్ చేయాలి. తరువాత వ్యూ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ స్థితి తెలిసిపోతుంది. దీంతో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి వాటి అమలుకు శ్రీకారం చుట్టనుంది. ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి తన వంతు పాత్ర పోషించనుంది.