
రోజుకు ఓ Egg తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నారు. కోడి గుడ్డులో ఉండే పోషకాలు అలాంటివి. గుడ్డు తినడం వల్ల అందులో ఉండే ప్రొటీన్లు మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. రోజు అల్పాహారంలో గుడ్డును చేర్చుకుంటే ఎంతో లాభం వస్తుంది. ఇలా గుడ్డును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్డును సంపూర్ణ పోషకాహారంగా చెబుతారు. అందుకే గుడ్డును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి సహకరిస్తుంది. దీన్ని ఎన్నో రకాలుగా తింటారు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. మరికొందరు ఫ్రై చేసుకుంటారు. ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వారు తింటారు. ఎలా తిన్న అందులో పోషకాలు మాత్రం మన శరీరానికి మేలు చేస్తాయనడంలో సందేహం లేదు.
Egg ను ఉడకబెట్టే క్రమంలో పలు పద్ధతులు ఉన్నాయి. కోడిగుడ్డును బాగా ఉడకబెడితే దాన్ని హార్డ్ బాయిల్డ్ ఎగ్ అని పిలుస్తారు. ఇలా చేస్తే గుడ్డులోని తెల్ల, పచ్చ సొనలు పూర్తిగా ఉడుకుతాయి. ఇలా తింటే మనకు తొందరగా జీర్ణం అవుతుంది. చాలా మంది ఈ పద్ధతినే ఎక్కువగా అవలంభిస్తారు. దీంతో ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తుంది.
కోడిగుడ్డును 5 నిమిషాల పాటు ఉడికిస్తే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ అంటారు. దీని వల్ల ఇందులో ఉండే పచ్చ సొన క్రీముగా ఉంటుంది. ఇది పాస్తా, టోన్డ్ లు వంటి వాటిలో వాడతాం. గుడ్డును 8 నిమిషాలు ఉడికిస్తే దీన్ని మీడియం బాయిల్డ్ ఎగ్ అంటారు. ఇది సలాడ్స్ లో వేసుకుంటారు. ఇలా కోడి గుడ్డును ఉడికించే పద్ధతులు ఉన్నాయి. ఇందులో మనకు ఏది ఇష్టమైతే దాన్ని వాడుకోవచ్చు.






