
ఈ రోజుల్లో పాదాల పగుళ్లు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చలికాలంలోనే ఉంటాయి. దీంతో మనం నలుగురిలో నడవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే చాలా మంది సాక్సులు వేసుకుని తిరుగుతుంటారు. కొందరు షూ వేసుకునే ఉంటారు. ఇలా దాచుకునే బదులు వాటిని పోగొట్టుకునే ఉపాయం ఆలోచిస్తే సరికదా. కానీ చాలా మందికి వాటిని ఎలా నయం చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ చిట్కా గురించి తెలుసుకోండి. పాదాల పగుళ్లను దూరం చేసుకోవచ్చు.
పాదాల పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇవి రావడానికి కారణాలేంటి అని ఆరా తీస్తే పలు విషయాలు తెలుస్తాయి. సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారికి కాళ్ల పగుళ్లు ఉంటాయి. ఇంకా గట్టి నేలపై ఎక్కువ సేపు నిలబడే వారికి కూడా కాళ్ల పగుళ్లు వస్తాయి. ఇవి కొందరిలో దారుణంగా కనిపిస్తాయి. గండ్లు వాసి చెరువు ఎండినప్పుడు నెర్రెలు బాసినట్లు ఉంటుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాదాల పగుళ్లు తగ్గాలంటే ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి మెత్తగా పేస్టులా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. పాదాలను పదినిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో ఉంచాలి. తరువాత పాదాలకు బియ్యం పిండి పేస్టును మెత్తగా రుద్దాలి. పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఇలా రెండు మూడు రోజలు చేస్తే పగుళ్లు లేకుండా పోతాయి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే తగ్గే వరకు కూడా ఇలాగే చేయాలి. దీంతో కాళ్ల పగుళ్లు లేకుండా పోతాయి. ఇంతటి అద్భుతమైన చిట్కా పాటించి కాళ్ల పగుళ్లు లేకుండా చూసుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయి. కానీ పగుళ్లతో కనిపిస్తే దారుణంగా ఉంటుంది. అందుకే వాటిని దాచుకునే బదులు ఆ సమస్యను తొలగించుకోవడం మంచిది.






