
Mukesh Ambani salary : దేశంలో అత్యంత సంపన్నుడు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. ప్రస్తుతం జియో ద్వారా ఎంతో ఎత్తులో ఉన్నారు. ఆయన ఎక్కడికెళ్లినా ఓదేశాధినేత స్థాయిలో సెక్యూరిటీ, రాచ మర్యాదలు ఉంటాయి. దేశంలో టాప్ లో కొనసాగుతున్న ఈ సంపన్నుడు అన్ని రంగాల్లో తన బిజినెస్ ను విస్తరిస్తూ మరింత ఎదుగుతున్నాడు.
అయితే రిలయన్స్ సంస్థకు చైర్మన్ గా ఉన్న ముఖేశ్ అంబానీ ఉన్నారు. 2024 ఏప్రిల్ 19 వరకు ఆయనే చైర్మన్ గా ఉంటారు. అయితే మరో ఐదేళ్ల కాలం తానే చైర్మన్ గా ఉండాలని ఆయన భావిస్తున్నారట. అంటే 2029 వరకు ఇక ముఖేశ్ చైర్మన్ గా ఉండబోతున్నారు. రిలయన్స్ ను దినాదినాభివృద్ధి చేస్తూ ఆయన సంస్థ వృద్ధిలో ప్రముఖంగా నిలుస్తున్నారు. 2012లో ధీరుబాయ్ మరణాంతరం చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక అప్పటి నుంచి తానే కొనసాగుతున్నారు. ఇక అప్పటి నుంచి కంపెనీని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. అయితే చైర్మన్ గా ఉన్న ముఖేశ్ అంబానీ వేతనంపై జోరుగా చర్చ నడుస్తున్నది.
అయితే ఆయన వేతనం తీసుకోవడం లేదని సమాచారం.. రిలయన్స్ నివేదికల ప్రకారం 2008-09 నుంచి 2109-20 వరకు ముఖేశ్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉంది. ఇక కరోనా సమయంలో ఆయన వేతనం తీసుకోవడం మానేశాడు. 2021 నుంచి ఇప్పటివరకు వేతనం తీసుకోవడం లేదు. దీంతో పాటు అలవెన్సులు కూడా ముఖేశ్ తీసుకోవడం లేదలని సమాచారం. శాలరీ తీసుకోనని బోర్డుకు చెప్పిన తర్వాత ముఖేశ్ తీసుకోవడం లేదని తెలుస్తున్నది.
అయితే ముఖేశ్ అంబానీ వేతనం తీసుకోకుండా ఎలా నెగ్గుకొస్తున్నారనే ప్రశ్న అందరికీ రావడం సహజమే. చైర్మన్ గా ఉన్న ఆయనకు ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. అవి కంపెనీనే భరిస్తుంది. ఇందులో ట్రావెలింగ్ ఖర్చు, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఆయనతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన భద్రతాపరమైన ఖర్చును కూడా కంపెనీనే భరిస్తుంది. ప్రస్తుతం ఇవి కంపెనీనే భరిస్తుంది. సో.. ఇక ఆయన వేతనం మాత్రం తీసుకోవడం లేదు.