
Rajinikanth bad habits : శివాజీరావు గైక్వాడ్ గా మనకు తెలియకున్నా రజినీకాంత్ గా సుపరిచితమైన వ్యక్తే. ఆయన నటనే కాదు జీవితం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలకు రాకముందు బస్ కండక్టర్ గా చేసిన గైక్వాడ్ సినిమాల్లోకి వచ్చాక తమిళ, తెలుగు ఇండస్ట్రీలను ఒక్క కుదుపు కుదిపాడు. ఇప్పటికీ తమిళ నాట జనం రాజినీకాంత్ అంటే విపరీతమైన క్రేజ్ చూపిస్తారు. రజినీకాంత్ సినిమా రిలీజైతే సాఫ్ట్ వేర్ ఆఫీస్ లు కూడా సెలవు ప్రకటించాయంటే ఆయన క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. శివాజీరావు గైక్వాడ్ గా ఉన్న తనకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నయంట. అందులో కొన్ని రజినీకాంత్ గా మారిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యాయట. ఈ విషయాన్ని రజినీకాంతే స్వయంగా చెప్పుకున్నారు. ఆయనకున్న అలవాట్ల గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం.
రచయిత, నటుడు వైజీ మహేంద్ర ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రజినీకాంత్ తన పర్సనల్ విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయనకు కొన్ని అలవాట్లు ఉండేవట అయితే అవి కావాలని చేసుకున్నవి కావు. కాలం, పరిస్థితుల నేపథ్యంలో వచ్చాయిన చెప్పుకున్నాడు రజినీకాంత్. వాటిని మానుకోవడం ఆయన వల్ల కాలేదట. అందులో కొన్ని ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఇలాంటి వ్యసనాల జోలికి పోవద్దని ఆయన యువతకు సూచనలు చేస్తున్నాడు.
రజినీకాంత్ భోజనం విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదట. ప్రతీ రోజూ రెండు పూటలా మటన్ ఉండాల్సిందేనట. ముక్కలేకపోతే ముద్దదిగని సార్ కు పెగ్గు కూడా తోడైందని చెప్పుకచ్చాడు. చుక్క, ముక్క ఈ రెండింటినీ కష్టాల్లో కూడా వదిలిపెట్టలేదట రజినీకాంత్. అయితే కొంత కాలం తర్వాత ఆయనకు సిగార్ కూడా కాల్చడం మొదలు పెట్టారట. అదే ఆయనను సినిమాలవైపునకు నడిపించింది. ఇది వేరే విషయం అనుకోడండి. కనీ ఎంతైనా బ్యాడ్ హ్యాబిటే కదా. డబ్బులు లేని సమయంలో బీడీలు కూడా కాల్చేవారట.
సినిమాల్లోకి వచ్చిన సమయంలో చేతినిండా డబ్బు ఉండేది. దీంతో తన బ్యాడ్ హ్యాబిట్స్ కు పట్టపగ్గాలు లేకుండా పోయాయట. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో మటన్ పాయ, అప్పం, చికెన్ ఉండేలా ఆర్డర్ వేసేవారట. ఈ ఆహారంతో పాటు సిగార్ లాంటివి మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.
రజినీకాంత్ వద్ద ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఆయన కూతురు దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సలామ్’, జైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరో రెండు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి తర్వాత సినిమాలకు రజినీ గుడ్ బై చెప్తారని న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే దీనిపై రజినీకాంత్ స్పందించలేదు. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.