Muthappan Temple :
ఏ మతం ప్రకారమైన గుడికి వెళ్లడం సహజం. మన హిందూ మతం ప్రకారమైతే గుడికి వెళ్లి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. తరువాత ఇంటికి వచ్చేస్తాం. కానీ కేరళలో ఓ వింతైన ఆచారం ఉంది. అక్కడ తీర్థానికి తేనీరు పోస్తారు. ప్రసాదం పెసర గుడాలతో చేస్తారు. దీంతో అక్కడకు వచ్చిన వారు ఆశ్చర్యానికి గురవుతారు. ఇదేంటి తేనీరు అంటే అది అక్కడ ఆచారంగా చెబుతుంటారు.
కేరళలోని కన్నూరు జిల్లా పరాసినిక్కడవు గ్రామంలో వెలసిని ముత్తప్పన్ ఆదివాసీల ఆరాధ్యదైవం. హరిహరుల అంశగా ఈ స్వామని భావిస్తారు. ముత్తప్పన్ ను అయ్యప్పగా కొలుస్తారు. ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న పరసినిక్కడువులో ముత్తప్పన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఇక్కడ ఆచారాలను చూసి షాక్ అవుతూ ఉంటారు.
ఇక్కడ ఈ ఆచారం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగడం గమనార్హం. తీర్థంగా తేనీరు, ప్రసాదంగా పెసర గుడాలు రెండు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ ఉష్ణోదకం ముందు అమృతం కూడా పనికి రాదట. ఉదయం పూట కాచే తొలి టీని దేవుడి పటం ముందు ఉంచి నైవేద్యంగా పెట్టిన తరువాత భక్తులకు ఇస్తారట. ఇలా ఈ ఆచారం చూసి భక్తులు కూడా పరేషాన్ అవుతుంటారు.
ఇలాంటి వింతైన ఆలయం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారట. ఇది గిరిజనుల ఆలయం. అందుకే వారి ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. గుడికి వచ్చిన వారికి టీ అందించి వారి భక్తిని చాటుకోవడం వారి బాధ్యత. ఇలా రోజుకు కొన్ని వేల టీలు భక్తులకు పోయడం ఆ ఆలయంలో ప్రధాన అలవాటుగా మారడం గమనార్హం.