
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు ఎవ్వరూ ఈయన దరిదాపుల్లో కూడా చేరుకోలేని స్థాయికి మెగాస్టార్ చేరుకున్నాడు.. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికి ఇదే హుషారుతో సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు..
ఇప్పటి వరకు మెగాస్టార్ ఎన్నో విభిన్నమైన సినిమాలలో వైవిధ్యమైన నటనతో మెప్పించారు.. ఈయన ఏ పాత్రకు అయిన పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేస్తారు.. వరుస విజయాలతో దూసుకు పోతున్న చిరు కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.. ఇప్పటికి కూడా ఆయన ఊ అనాలి కానీ వెంటనే సినిమా చేయడానికి డైరెక్టర్లు అందరు వైట్ చేస్తుంటారు.
ఇప్పటికే 150 సినిమాల మైలు రాయిని దాటేసిన చిరు ఇంకా సినిమాలు చేస్తున్నాడు.. అయితే చిరు తన సినిమాలలో కుటుంబ సభ్యులతో కూడా కలిసి నటించారు.. కొడుకు రామ్ చరణ్ తో వెండితెరను పంచుకున్నాడు. అలాగే బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో కూడా కలిసి నటించారు.. ఇంకా తన అల్లుళ్ళు, బామ్మర్దీలతో కూడా కలిసి నటించిన చిరు తన తండ్రితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు అని మీకు తెలుసా?
ఈ విషయం చాలా మందికి తెలియదు.. కానీ చిరంజీవి తండ్రి వెంకట్రావు గారికి నటనపై ఉన్న ఆసక్తి కారణంగా చిరుతో కలిసి వెండితెర మీద కనిపించారట.. జగత్ కిలాడీలు అనే చిత్రంలో నటించిన ఆయన తండ్రి ఆ తర్వాత మాత్రం కుటుంబ బాధ్యతల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారట.. ఎలాగైతేనేం చిరు తన తండ్రి కోరికను తీర్చడమే కాకుండా.. తాను కూడా తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.